ఉల్లి డిమాండ్ చూసి నోరెల్లబెట్టాల్సిందే... ఉల్లిని ఆఫర్స్ లో పెడుతున్న వ్యాపారులు

పూర్వం పెద్దలు ఉల్లికి, తల్లికి ఎందుకు లింక్ పెట్టారో తెలియదు కాని ఇప్పుడు దేశం యావత్తు ఉల్లి గురించి చర్చించుకోవడం చూస్తుంటే దానికి అంత ప్రాముఖ్యత ఉందా అనిపిస్తుంది.దేశంలో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటేసాయి.

 Onions Trend Indian Onion-TeluguStop.com

చికెన్ ధర కంటే ఉల్లి ధర ఎక్కువైపోయింది.కొన్ని చోట్ల ఉల్లి రెండు వందల రూపాయిలు కూడా పలుతుంది.

ఇంతలా ఉల్లి ధరలు పెరిగిపోవడంతో వినియోగదారుడు అంత సొమ్ము పెట్టి కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు.ఇదిలా ఉంటే ఉల్లికి ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొంత మంది వ్యాపారులు తమ కస్టమర్స్ ని ఆకట్టుకోవడం కోసం ఉల్లిని ఆఫర్స్ గా పెడుతున్నారు.

నిజానికి మనం పెట్రోల్ పోసుకోండి కారు గెలుచుకొండి, కారు కొనండి తులం బంగారం సొంతం చేసుకోండి, గోవా ట్రిప్ వెళ్ళండి అదిరిపోయే గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోండి అని ప్రకటనలు వింటూ ఉంటాం ఇప్పుడు వ్యాపారులు కాస్తా వినూత్నంగా ఆలోచించి ఉల్లిని కూడా ఆఫర్స్ లో పెడుతున్నారు.పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ చికెన్ వ్యాపారి కేజీ చికెన్ కొంటె అరకిలో ఉల్లి ఫ్రీ అని ఆఫర్ లో పెట్టాడు.

విజయనగరంలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోండి పది కేజీల ఉల్లిపాయలు గెలుచుకునే అవకాశం అని ప్రైజ్ గా పెట్టారు.ఓ ట్రావెల్ ఏజెన్సీ ఇప్పుడు ఏకంగా మరో ఆఫర్ పెట్టింది.

గోవా ట్రిప్ బుక్ చేసుకుంటే మూడు కేజీల ఉల్లిపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటన చేసింది.దీనికి ఇప్పుడు మంచి స్పందన వస్తుందని ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ ప్రతినిధి తెలిపారు.

తమిళనాడులో ఓ మొబైల్ స్టోర్ లో మొబైల్ కొంటె ఉల్లిపాయలు బహుమతిగా గెలుచుకొంది అని ఆఫర్ ప్రకటించింది.ఈ ఆఫర్ పెట్టిన తర్వాత మొబైల్ అమ్మకాలు పెరిగినట్లు ఆ స్టోర్ ఓనర్ చెప్పారు.

ఇలా ఎన్నడూ లేని విధంగా దానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు ఉల్లిపాయలు బహుమతి వస్తువుగా మారిపోయింది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube