ఏపీలోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు.
ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని బాలినేని వెల్లడించారు.పార్టీ మార్పు దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొన్నారు.
యర్రజెర్ల జగనన్న కాలనీలపై టీడీపీ నేత దామచర్ల కోర్టులో కేసు వేశారన్నారు.కోర్టులో కేసు వేశారన్న వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని తెలిపారు.
కేసు వేశాడని నిరూపిస్తే రాజకీయాలు వదిలేయడానికి దామచర్ల సిద్ధమా అని ప్రశ్నించారు.నిరూపించకపోతే రాజకీయాలు వదిలేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.