అవును, మీరు విన్నది నిజమే.మార్చి 25వ తేదీన వన్ బెట్( OneWeb ) ఇస్రోతో కలిసి 36 ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించనుందని సమాచారం.
భారతీ ఎంటర్ ప్రైజస్ ప్రోద్భలంతో వన్ వెబ్ కంపెనీ సహాయంతో ఇస్రో ( ISRO ) 36 ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించడానికి సన్నద్ధమైంది.ఇప్పటి వరకు వన్‌వెబ్ సంస్థ 18 సార్లు శాటిలైట్లను ప్రయోగించిన సంగతి విదితమే.
కాగా ఈ ఏడాది ఇది మూడవ పరీక్ష కానుంది.మార్చి 25వ తేదీన ఈ ప్రయోగం జరగనున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ ఎల్ఈవో కాన్ స్టెల్లేషన్ లో భాగంగా ఆ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది.శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆ శాటిలైట్లను ప్రయోగించనున్నారు.36 శాటిలైట్ల( 36 Satellites ) ప్రయోగం సందర్భంగా వన్‌వెబ్ కంపెనీ సదరు స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది.వన్ వెబ్ చరిత్రలో ఇది ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు.
వన్ వెబ్ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించడం ఇది రెండవసారి అవుతుంది.ఇస్రోకు చెందిన కమర్షియల్ విభాగం ఎన్ఎస్ఐఎల్ ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తుంది.
ఇకపోతే ఇందులో భాగంగా లాంచ్ వెహికిల్ మార్క్-3 రాకెట్ ద్వారా.ఎర్త్ ఆర్బిట్ లోకి శాటిలైట్లను పంపనున్నారు.వన్ వెబ్ కంపెనీ ఇటీవల స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా 40 ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించిన విషయం మీకు తెలిసే ఉంటుంది.అదొక రికార్డు అనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయేది రెండవ రికార్డు అవుతుంది.
ఇది గాని జరిగితే వన్ వెబ్ అద్భుతాన్ని చేసినట్టు అవుతుందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.కాబట్టి దీనిపైన మీ మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి.