2015వ సంవత్సరంలో భారతదేశంలో తన కార్య కలాపాలను ప్రారంభించిన ఒకినావా( Okinawa ), తన ఉత్పత్తిలో ఒక కొత్త చరిత్రను నమోదు చేసింది.అవును, ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగు పెట్టిన తరువాత అతి తక్కువ వ్యవధిలోనే మంచి ఆదరణ పొందిన ‘ఒకినావా’ ఇప్పుడు కొత్త మైలురాయిని చేరుకోవడం విశేషం.
ఈ క్రమంలో ఇటీవల కంపెనీ తన 2,50,000వ యూనిట్ ప్రైజ్ ప్రో ఆఫ్ ప్రొడక్షన్ రాజస్థాన్‌లోని తన ప్లాంట్ నుండి విడుదల చేయడం జరిగింది.అంటే కంపెనీ 2,50,000 వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 సంవత్సరాల సమయం పట్టిందన్నమాట.

2015లో కార్యకలాపాలను ప్రారభినప్పటికీ 2017లో ఒకినావా రిడ్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్( Okinawa Ridge Electric Scooter ) పరిచయం చేసింది.తరువాత 2019లో భారత ప్రభుత్వం నుంచి మొదట ఫేమ్ II సబ్సిడీని పొందిన ఘనతను కూడా దక్కించుకుంది.క్రమంగా మార్కెట్లోకి ఐప్రైస్ ప్లస్, ప్రైస్ ప్రో, లైట్, ఆర్30 వంటి వాటిని రిలీజ్ చేసి బాగా విస్తరించింది.2021లో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన ఒకినావా అదే సంవత్సరంలో గెలాక్సీ స్టోర్( Galaxy Store )లను ప్రారంభించింది.కాగా 2022లో కంపెనీ ఒకేహి-90 తీసుకురావడమే కాకుండా రాజస్థాన్‌లోని 2వ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది.

ఇక ఈ కంపెనీ 2025 నాటికి 1000 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను విస్తరించాలనే దిశగా అడుగులు వేస్తోందని సర్వేలు చెబుతున్నాయి.దానికి అనుగుణంగానే ప్రయత్నాలు సాగిస్తోంది.ఒకినావా, టాసిటాతో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో మరో మూడు సంవత్సరాలలో రూ.218 కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీగా వుంది.ఇది జరిగితే త్వరలోనే ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ తీసుకురానున్నట్లు సమాచారం.
అదే సమయంలో 2025 నాటికి ఉతప్పటిలో 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది.







