పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో ఒకరు మృతి..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించడం తెలిసిందే.

కొండగట్టులో వారాహి వాహనానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది.

అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ .పొత్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం బిజెపితోనే పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చే ప్రసక్తి లేదని ప్రతిపక్షాలు ఏకం కావాలని పవన్ మీడియా వద్ద తెలియజేయడం జరిగింది.ఇంకా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్.

ప్రతిపక్షాలను అణచివేయడానికే అని అన్నారు.

Advertisement

రాష్ట్రంలో 175 సీట్లు వస్తాయని అంటున్న వైసీపీ ఎందుకు ఈ  రీతిగా చేస్తోందని ప్రశ్నించారు.ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఏడు నుంచి 14 ఎంపీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని పేర్కొన్నారు.అయితే ఈ పర్యటనలో తిరిగి హైదరబాద్ వస్తుండగా అపశృతి చోటు చేసుకుంది.

సరిగ్గా కిషన్ రావు పేట వద్ద పవన్ కాన్వాయ్ ఫాలో అయ్యేందుకు ప్రయత్నించి ఓ అభిమాని ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది.కాన్వాయ్ ని వెంబడించే క్రమంలో.అదుపుతప్పి అదే కాన్వాయ్ లో ఉన్న మరో వాహనాన్ని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.

ఇక ఇదే ఘటనలో మరో ముగ్గురు గాయపడటం జరిగింది.గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?
Advertisement

తాజా వార్తలు