అసలైన మాస్ పవర్ ను చూపించిన బాలకృష్ణ.. మరో రేర్ రికార్డుతో?

స్టార్ హీరో బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది.బాలయ్య సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో అఖండ సినిమా ద్వారా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

 One More Rare Record In Star Hero Balakrishna Account Details Here , Hero Balak-TeluguStop.com

మరోవైపు అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా బాలయ్య అంతకంతకూ ఎదుగుతున్నారు.అన్ స్టాపబుల్ సీజన్2 షో తొలి ఎపిసోడ్ కు చంద్రబాబు గెస్ట్ గా హాజరై ఎన్నో సీక్రెట్స్ ను పంచుకున్న సంగతి తెలిసిందే.

100 నిమిషాల నిడివి ఉన్న ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అన్ స్టాపబుల్ షో కేవలం నాలుగు రోజుల్లో 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

తక్కువ రోజుల్లో ఈ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ షో ఆహా ఓటీటీకి సబ్ స్క్రైబర్ల సంఖ్యను భారీ స్థాయిలో పెంచిందని సమాచారం అందుతోంది.టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఎపిసోడ్ కోసం ఈ షో సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారు.

Telugu Akhanda, Balakrishna, Chandrababu, Mass, Pawan, Trivikram, Vishwak Sen-Mo

అన్ స్టాపబుల్ షో సీజన్2 మరో రేర్ రికార్డును ఖాతాలో వేసుకోవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.మరో రెండు రోజుల్లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హాజరైన ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఈ షోకు రాబోయే రోజుల్లో హాజరయ్యే గెస్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.త్రివిక్రమ్, పవన్ ఈ షోకు హాజరు కానుండగా వాళ్లు ఎప్పుడు వస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

Telugu Akhanda, Balakrishna, Chandrababu, Mass, Pawan, Trivikram, Vishwak Sen-Mo

పవన్ ఈ షోకు హాజరైతే మాత్రం ఏపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కూడా స్పందించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.అన్ స్టాపబుల్ షోకు రావడానికి చిరంజీవి సుముఖత వ్యక్తం చేశారని బోగట్టా.అయితే ఆయన ఎప్పుడు ఈ షోకు హాజరవుతారనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube