రంగారెడ్డి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తున్నాయి.పంట పొలాలు నీటమునిగాయి.
మరోవైపు రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది.శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 15 అండర్ పాస్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడా బారికేడ్లను ఏర్పాటు చేశారు.అయితే బారికేడ్లను తొలగించి వెళ్లేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్ వరద నీటిలో చిక్కుకునిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను, క్లీనర్ ను రక్షించారు.







