అసలైన మాస్ పవర్ ను చూపించిన బాలకృష్ణ.. మరో రేర్ రికార్డుతో?

స్టార్ హీరో బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది.

బాలయ్య సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో అఖండ సినిమా ద్వారా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

మరోవైపు అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా బాలయ్య అంతకంతకూ ఎదుగుతున్నారు.అన్ స్టాపబుల్ సీజన్2 షో తొలి ఎపిసోడ్ కు చంద్రబాబు గెస్ట్ గా హాజరై ఎన్నో సీక్రెట్స్ ను పంచుకున్న సంగతి తెలిసిందే.

100 నిమిషాల నిడివి ఉన్న ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అన్ స్టాపబుల్ షో కేవలం నాలుగు రోజుల్లో 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

తక్కువ రోజుల్లో ఈ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ షో ఆహా ఓటీటీకి సబ్ స్క్రైబర్ల సంఖ్యను భారీ స్థాయిలో పెంచిందని సమాచారం అందుతోంది.

టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఎపిసోడ్ కోసం ఈ షో సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారు.

"""/"/ అన్ స్టాపబుల్ షో సీజన్2 మరో రేర్ రికార్డును ఖాతాలో వేసుకోవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

మరో రెండు రోజుల్లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హాజరైన ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ షోకు రాబోయే రోజుల్లో హాజరయ్యే గెస్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

త్రివిక్రమ్, పవన్ ఈ షోకు హాజరు కానుండగా వాళ్లు ఎప్పుడు వస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

"""/"/ పవన్ ఈ షోకు హాజరైతే మాత్రం ఏపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కూడా స్పందించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అన్ స్టాపబుల్ షోకు రావడానికి చిరంజీవి సుముఖత వ్యక్తం చేశారని బోగట్టా.అయితే ఆయన ఎప్పుడు ఈ షోకు హాజరవుతారనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ ఇదేనా.. బాలయ్య అలాంటి రోల్ లో కనిపిస్తారా?