ఒకే సినిమా.. ముగ్గురు టాప్ హీరోలు.. మూడు భాషల్లో విడుదల.. అన్నీ చోట్లా డిజాస్టర్..

దేశ వ్యాప్తంగా ఒక భాషలో రిలీజై మంచి విజయం సాధిస్తే ఆ సినిమాను పలు భాషల్లోకి రీమేక్ చేయడం కామన్.

ఈ పద్దతి చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది.

కథ మీద నమ్మకంతో కొన్ని సినిమాల్లో మూడు, నాలుగు భాషల్లోనూ విడుదల చేస్తారు కూడా.అయితే నైటీస్ లో చేసిన ఓ కొత్త ప్రయోగం ఘోరంగా దెబ్బ కొట్టింది.

ఓ సినిమాను 3 భాషల్లో ముగ్గురు టాప్ హీరోలను పెట్టి తీశారు.అయితే ఈ సినిమాలు మ్యాగ్జిమమ్ హిట్ కావాలి.

కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి.ఇంతకీ ఆ సినిమా ఏంటీ? ఎందుకు హిట్ కొట్టలేకపోయింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.1991లో కన్నడలో ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన రవిచంద్రన్ మంచి స్ర్కిప్ట్ సిద్ధం చేసుకున్నాడు.ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడలో తీయాలనుకున్నాడు.

Advertisement

హీరోలుగా ఆయా సినిమా పరిశ్రమల్లోని టాప్ హీరోలను తీసుకోవాలి అనుకున్నాడు.అన్ని సినిమాలకు తానే దర్శకత్వం వహించాలి అనుకున్నాడు.

ఈ సినిమాకు శాంతి క్రాంతి అనే పేరు పెట్టాడు.తెలుగులో నాగార్జునను, తమిళంలో రజనీకాంత్ ను కన్నడలో తానే హీరోగా ఈ సినిమా చేయాలి అనుకున్నాడు.

అప్పట్లో సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాను తీశాడు రవి చంద్రన్.అన్ని భాషల్లో హీరోయిన్ గా జూహీ చావ్లా నటించింది.1991 సెప్టెంబర్ 19న మూడు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా విడుదలైన మూడు చోట్ల ఘోర పరాజయం పాలైంది.10 కోట్ల రూపాయలు పెట్టిన తీసిన ఈ సినిమాలు కనీసం 3 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయాయి.

ఈ సినిమా సంగీతం జనాలను అలరించినాకథలో బలం లేకపోవడంతో జనాలను ఆకట్టుకోలేకపోయింది.కథ సాగదీసినట్లు ఉండటంతో జనాలు విసుగు చెందారు.మొత్తంగా ఈ కొత్త ప్రయోగం చెత్త ప్రయోగంగా మిగిలిపోయింది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఈ సినిమా దెబ్బకు రవి చంద్రన్ కోలుకోలేని విధంగా నష్టపోయాడు.

Advertisement

తాజా వార్తలు