నల్గొండ జిల్లా, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం మదర్ డైరీ చైర్మన్ గంగుల కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజు ఈ సందర్భంగా మదర్ డైరీ పాలకవర్గం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు, పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.మదర్ డైరీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అపర భగీరథుడు అని రైతులపట్ల, నిరంతర విద్యుత్,పాడి పరిశ్రమకు అనేక కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
అన్ని రాష్ట్రాల సీఎంలు సీఎం కేసీఆర్ సార్ ను అభినందిస్తూ సీఎం కేసీఆర్ ని దేశమంతా ఫాలో అవుతున్నారు అని మదర్ డైరీ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు, బీజేపీ ని ఎదుర్కొంటూ కాబోయే దేశ రాష్ట్రపతి అని మదర్ డైరీ చైర్మన్ అన్నారు, అని రంగాల్లో తెలంగాణ ముందుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ప్రజలకు 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడంలో విఫలమైందని తెలిపారు.
అన్ని రాష్ట్రాలలో మన సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలు ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తున్నారు ఏ పథకాలు పెడతారా అని ఎదురు చూస్తున్నారని మదర్ డైరీ చైర్మన్ తెలిపారు.
అన్ని రాష్ట్రాల సీఎం మద్దతు కేసీఆర్ గారికి ఉందని కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వారు తెలియజేశారు.సీఎం కేసీఆర్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నామని మదర్ డైరీ సంఘం తరఫున గంగుల కృష్ణారెడ్డి తెలియజేశారు.