ఒకప్పటి రాజకీయ వ్యూహాలు ఇప్పుడు పని చేయవు: రాహుల్ గాంధీ

ప్రజలతో మమేకమవడానికి ఉన్న అన్ని సాధనాలను బాజాపా ఆర్ఎస్ఎస్( Bjp BRS ) తమ గుప్పెట్లో పెట్టుకున్నందున ఒకప్పటి రాజకీయ వ్యూహాలు( Political tactics ) ఇప్పుడు పని చేయవని రాహుల్ గాంధీ( Rahul Gandi ) చెప్పుకొచ్చారు ,దానికోసమే తాను ప్రజల్ని కలవడానికి జోడో యాత్ర చేయాల్సి వచ్చిందన్నారు.( America tour ) ఉన్న ఆయన కాలిఫోర్నియాలోని శాంట క్లారా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలను ప్రవాస బారతీయులను ఉద్దేశించి మాట్లాడారు.

 Old Political Tactics No Longer Work Rahul Gandhi Details, Rahul Again Fires On-TeluguStop.com

భారత్లో పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచం మీడియా చూపించినట్లుగా లేవని, విచారణ సంస్థల నుంచి మీడియా వ్యవస్థల వరకు తమ గుప్పెట్లో పెట్టుకుని భాజపా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు.అన్ని తమకే తెలుసనుకునే మనుషులు ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నారనీ వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని నేర్పించగలరు, చరిత్రకారులకు చరిత్ర గురించి వివరించగలరు, యుద్ధము ఎలా చేయాలో సైనికులకు నేర్పించగలరు, చివరికి దేవుడికి కూడా సృష్టి ఎలా పనిచేస్తుందో వివరించి గందరగోళపరచగలరు, అని ఆయన విమర్శించారు .దేశంలో పట్టించుకోవడానికి అనేక సమస్యలు ఉన్నా వాటిని వారు పట్టించుకోరని నిరుద్యోగం, ధరల పెరుగుదల ,అవినీతి వంటి విషయాల కన్నా అధికారం కోసం ప్రజల మద్య విద్వేషాలు పెంచడం మీదే వారి దృష్టి ఉంటుందని ఆయన విమర్శించారు.

Telugu Anurag Thakur, Narendra Modi, Rahul Bjp, Rahul Gandi, Rahul Gandi Bjp, Ra

అంతర్జాతీయంగా మోడీ పరువు తీయాలనే ఉద్దేశంతో దేశo పరువు తీస్తున్నారని ,ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ తన వ్యవహార శైలి మారలేదని అమెరికా పర్యటన ఆధారంగా నిరూపించారని రాహుల్ వ్యాఖ్యలపై భాజపా నేతలు, కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు.మీరెన్ని ప్రయత్నాలు చేసినా భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి గొప్పతనాన్ని తగ్గించలేరం టూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ( Anurag thakur )వ్యాఖ్యానించారు .దేశం దాటి వెళ్ళగానే ఆయనలో జిన్నా ఆత్మ లేదా భారత వ్యతిరేకల ఆత్మ ప్రవేశిస్తున్నట్టుందని దానికి తగిన వైద్యం చేయించుకోవాలంటూ కొందరు భాజాప నేతలు వ్యాఖ్యానించారు.రాహుల్ సమావేశంలో కూడా కొందరు భాజపా మద్దతుదారులు మోడీ నినాదాలు చేశారు……

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube