ఓలా క్యాబ్ డ్రైవర్ తో సంజన రచ్చ.. వైరల్?

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసులో భాగంగా జైలు పాలైన నటి సంజన గల్రాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అప్పట్లో ఈమె గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వినిపించాయి.

తాజాగా ఈమెకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే సంజన ఓలా క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడటం తో గొడవ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంగళవారం సంజనా షూటింగ్ స్పాట్ కి వెళ్ళడం కోసం ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు.బెంగళూరులోని ఇందిరా నగర్ నుంచి రాజా రాజేశ్వరి నగర్ కు ఆమె క్యాబ్ బుక్ చేశారు.

అయితే క్యాబ్ ఎక్కిన తర్వాత గమ్యం మార్చాలని డ్రైవర్ కు సూచించడంతో డ్రైవర్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి అడిగినప్పటికీ లొకేషన్ మార్చకపోవడంతో క్యాబ్ డ్రైవర్ పై తీవ్రస్థాయిలో మండిపడింది.ఈ క్రమంలోనే ఈ విషయంపై డ్రైవర్ స్పందిస్తూ తనని నానా తిట్లు తిట్టి గొడవ పెట్టుకుందని ఆరోపించాడు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ విషయంపై నటి సంజన క్యాబ్ డ్రైవర్ పై రాజరాజేశ్వరి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కారులో ఏసి పెంచాలని చెప్పిన డ్రైవర్ వినడం లేదని కార్ డోర్స్ కూడా సరిగా లేవని, డ్రైవర్ తాను చెప్పిన చోటకు తీసుకు వెళ్ళలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

వారు అడిగినంత డబ్బు ఇచ్చి కూడా ఇలాంటి చెత్త కారులో వెళ్లాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె క్యాబ్ లోనే 100 కి డయల్ చేసి క్యాబ్ డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు