సేఫ్ జోన్ లో ఓ బేబి కలెక్షన్స్

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి డిఫరెంట్ సినోమాలతో సమంత తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా ఓ బేబీ సినిమాలో కొత్తగా కనిపించిన అమ్మడు మంచి బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకుంది.

కామెడీ అండ్ ఎమోషనల్ యాంగిల్ ను చూపించి 20కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని లాగేసింది.

జులై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ బేబీ మొదటి 7 రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వచ్చేసింది.10 కోట్ల థ్రియేటికల్ వాల్యూ తో విడుదలైన ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటూ వచ్చింది.ఇక ఫస్ట్ వీక్ లో సినిమా 11.05 కోట్ల షేర్స్ ని అందుకొని బయ్యర్లను లాభల్లోకి తీసుకొచ్చింది.ఈ వారం విడుదలైన సినిమాలు కలెక్షన్స్ లో పెద్దగా క్లిక్కయ్యేలా లేవు.

దీంతో సమంత మరో వారం ఇదే రేంజ్ లో కొనసాగితే మంచి లాభాలు అందుతాయి.మరి సినిమా టోటల్ గా ఏ మేర లబాల్ని అందిస్తుందో చూడాలి.ఇక నెక్స్ట్ కూడా సమంత మళ్ళీ నందిని రెడ్డి డైరెక్షన్ లొనే ఒక సినిమా చేయాలని అనుకుంటోంది.

Advertisement

భర్త నాగ చైతన్య తో కలిసి సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆ సినిమాను నిర్మించనున్నట్లు టాక్.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు