న్యూయార్క్: చీఫ్ హెల్త్ ఆఫీసర్‌గా భారత సంతతి డాక్టర్‌.. కొత్త మేయర్ ఆదేశాలు

ఇటీవల న్యూయార్క్ కొత్త మేయర్‌గా ఎన్నికైన ఎరిక్ ఆడమ్స్ తన మార్క్ చూపిస్తున్నారు.ఇటీవల నగర పోలీస్ కమీషనర్‌గా తొలిసారి మహిళను నియమించిన ఆయన.

తన జట్టులో నిపుణులు, సమర్ధులైన వారికి చోటు కల్పిస్తున్నారు.తాజాగా అత్యంత కీలకమైన న్యూయార్క్ సిటీ చీఫ్ హెల్త్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన దేవ్ చోక్షీని నియమించారు.

న్యూయార్క్‌లో ఓవైపు ఒమిక్రాన్.మరోవైపు డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సిటీ హెల్త్ చీఫ్‌గా కొనసాగుతున్న చోక్షీని కొనసాగించాలని ప్రస్తుత మేయర్ డిల్ బ్లాసియో సూచించారు.

దీనిని పరిగణనలోనికి తీసుకున్న ఎరిక్ ఆడమ్స్ .దేవ్ చోక్షీని అదే బాధ్యతల్లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.మార్చిలో ఆయన కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

ఇకపోతే ఫౌంటెన్ హౌస్ ఎన్జీవో ప్రెసిడెంట్‌గా, ఆడమ్స్ ట్రాన్సిషన్ టీమ్ హెల్త్ కమిటీ కో ఛైర్‌గా వున్న అశ్విన్ వాసన్ మార్చి 15న హెల్త్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ కాలంలో అశ్విన్ .సీనియర్ పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు.ఆగస్ట్ 2020 నుంచి న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్‌కు సారథిగా వ్యవహరిస్తోన్న చోక్షీ.

జనవరి 1న ఎరిక్ ఆడమ్స్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం టీకాపై ప్రచారాన్ని నిర్వహించనున్నారు.అంతకుముందు న్యూయార్క్‌లోని హెల్త్ ప్లస్ హాస్పిటల్‌లో చీఫ్ పాపులేషన్ హెల్త్ ఆఫీసర్‌గానూ దేవ్ పనిచేశారు.ఇక అశ్విన్ వాసన్ విషయానికి వస్తే.

ఆయన కొలంబియా యూనివర్సిటీ మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వాగేలోస్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎపిడెమియాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, మిచిగాన్ యూనివర్సిటీ నుంచి మెడికల్ డిగ్రీని, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో అశ్విన్ పీహెచ్‌డీ చేశారు.

ఆయనకు ప్రజారోగ్యంలో 20 ఏళ్ల అనుభవం వుంది.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

ఇప్పటికే కోవిడ్ నుంచి న్యూయార్క్ వాసులను రక్షించడానికి కొత్త కలర్ కోడెడ్ వార్నింగ్ సిస్టమ్‌ని రూపొందిస్తానని కొత్త మేయర్ ఎరిక్ ఆడమ్స్ వాగ్థానం చేశారు.స్కూలు పిల్లలకు వ్యాక్సిన్‌లను తప్పనిసరి చేస్తానని.అలాగే ఆరోగ్య నిపుణుల సిఫారసు మేరకు బూస్టర్ డోసుల పంపిణీని వేగవంతం చేస్తానని ఆడమ్స్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు