జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్.. 2025 బాక్సాఫీస్ పోరులో గెలుపెవరిదో?

2023 సంవత్సరంలో లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) డైరెక్షన్ లో తెరకెక్కిన లియో, బాలయ్య (Leo, Balayya)హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి(Bhagwant Kesari) బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

ఈ సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి.

అయితే ఈ ఏడాది కూడా నందమూరి హీరో సినిమాకు పోటీగా లోకేశ్ కనగరాజ్ మూవీ విడుదల కానుందని సమాచారం అందుతోంది.ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా వార్2(WAR 2) సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.అయితే వార్2 సినిమాకు పోటీగా కూలీ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.వార్2, కూలీ (war2, Coolie)సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయని సినీ అభిమానులు అస్సలు ఊహించలేదు.అయితే ఈ రెండు సినిమాల పోటీ వల్ల ఏదో ఒక సినిమా నష్టపోయే ఛాన్స్ ఉంది.

బాలీవుడ్, తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉండగా మిగతా రాష్ట్రాల్లో వార్2 మూవీ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి.

ప్రస్తుతం వార్2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే కూలీ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జైలర్(Jailer) సినిమా ఆగష్టుకు విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన నేపథ్యంలో కూలీ విషయంలో లోకేశ్ కనగరాజ్ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.వార్2, కూలీ బాక్సాఫీస్ పోటీ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్2 (Young Tiger NTR War 2)సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వార్2 సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.వార్2 సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

హనుమాన్ రికార్డ్ ను క్రాస్ చేసే సినిమా ఏది.. సంక్రాంతికి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Advertisement

తాజా వార్తలు