తారక్ రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే.. ఎన్ని హిట్.. ఎన్ని ప్లాప్.. అంటే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును ఈ రోజు జరుపు కుంటున్నారు.ఈయన పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి.

నందమూరి ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ బర్త్ డే వల్ల సందడిగా మారింది.

ఈ క్రమంలోనే ఈయన కొత్త సినిమాల అప్డేట్ లు వరుసగా రావడానికి రెడీగా ఉన్నాయి.ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్.

ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.ఇది ఇలా ఉండగా ఈయన కెరీర్ లో కొన్ని రిజక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి మరి ఆ సినిమాలు ఏంటో వాటిలో ఎన్ని హిట్ అయ్యాయో.

Advertisement

ఎన్ని ప్లాప్ అయ్యాయో చూద్దాం.

భద్ర :

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ ముందుగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లగా ఆయన నో చెప్పడంతో రవితేజ చేసి హిట్ కొట్టాడు.

దిల్ :

వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2003లో రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ఎన్టీఆర్ తో చేయాలనీ అనుకున్న కుదరలేదు.

అతనొక్కడే :

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ రిజక్ట్ చేయగా కళ్యాణ్ రామ్ తో చేసాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి కళ్యాణ్ రామ్ ను హీరోగా నిలబెట్టేలా చేసాడు.

ఆర్య :

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముందుగా ఎన్టీఆర్ కు చెప్పగా ఆయన నో చెప్పాడట.దీంతో అల్లు అర్జున్ తో చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

కృష్ణ :

వినాయక్ కు ఎన్టీఆర్ కు మధ్య మంచి అనుబంధం ఉంది.కానీ ఎందుకో వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేక పోయారు.

ఈ సినిమా కూడా చేయాలని అనుకున్న కుదరక పోవడంతో రవితేజ తో చేసి హిట్ కొట్టాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కిక్ :

సురేందర్ రెడ్డి చెప్పిన కిక్ స్టోరీ ఎందుకో ఎన్టీఆర్ కు నచ్చక వదిలేసాడట.ఆ తర్వాత రవితేజ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఊపిరి :

నాగార్జున, ఎన్టీఆర్ కలిసి ఊపిరి తీయాలని అనుకోగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో ఎన్టీఆర్ తప్పుకున్నాడు.దాంతో కార్తీ తో సినిమా చేయగా హిట్ అయ్యింది.

Advertisement

శ్రీమంతుడు :

కొరటాల దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా కథ ఎన్టీఆర్ కు చెప్పగా ఆయన నో చెప్పాడట.

దీంతో మహేష్ బాబు తో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.

రాజా ది గ్రేట్ :

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ ముందు ఎన్టీఆర్ కు చేరగా ఆయన నో చెప్పద్మతో రవితేజ తో చేసి హిట్ కొట్టాడు.

బ్రహ్మోత్సవం :

ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన సినిమాల్లో ఈ సినిమా మాత్రమే ప్లాప్ అయ్యింది.మిగతా అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటించగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు.

తాజా వార్తలు