ఆమె తెలుగు పిలుపు నన్ను కదిలించింది.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఇటీవల నటించిన చిత్రం దేవర.

( Devara ) కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

దేశవ్యాప్తంగా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లో విడుదల కావడానికి సిద్ధమయ్యింది.ఎన్టీఆర్ కు ఇతర దేశాలలో అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా జపాన్ లో( Japan ) ఎన్టీఆర్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం ఈ సినిమా జపాన్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా జపాన్ లో బిజీబిజీగా ఉన్నారు.

Advertisement

అయితే ఈ ప్రచార కార్యక్రమాల్లో ఉన్న తారక్ కు ఒక మధుర అనుభవం ఎదురయిందని చెప్పాలి.అదే విషయాన్ని తారక్ తను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.తారక్ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అందులో ఎన్టీఆర్ జపనీస్ అభిమానులకు తన ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉండగా ఇంతలో ఒక జపనీస్ యువతి అన్న అంటూ ప్రేమగా ఆప్యాయంగా పలకరించింది.అన్నా నేను ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా చూసిన తరువాత రెండేళ్ల పాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నాను అంటూ తారక్ తో చెప్పడంతో ఆ మాట విన్న తారక్ ఓ మై గాడ్ అంటూ ఆశ్చర్య వ్యక్తం చేశాడు.

సదరు జపనీస్ లేడీ అభిమాని తన ఆటోగ్రాఫ్ ను ఇస్తూ చాలా సంతోషం వ్యక్తం చేశారు.

ఆమె తెలుగుకి తారక్ సైతం ఆశ్చర్యపోయారు.ఇదే విషయాన్ని ఎన్టీఆర్ తెలుపుతూ.నా జపాన్‌ పర్యటనలన్నీ నాకెన్నో అందమైన జ్ఞాపకాల్ని అందిస్తుంటాయి.కానీ ఈ అనుభవం మరింత భిన్నంగా మనసుని తాకింది.

ఒక్క వీడియోతో అంచనాలు పెంచేసిన బన్నీ అట్లీ.. మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్!
మరో ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లను లైన్ లో పెట్టిన అల్లు అర్జున్...

ఒక జపనీస్‌ అభిమాని ఆర్‌ఆర్‌ఆర్‌ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నిజంగా నన్నెంతో కదిలించింది.సంస్కృతుల మధ్య వారధిగా ఉండటంలో సినిమా తన శక్తిని చాటి చెబుతోంది.

Advertisement

భాషలు, సినిమా ప్రేమికుడిగా ఒక అభిమాని తెలుగు భాష నేర్చుకోవడానికి సినిమా ప్రోత్సహించిందని చెప్పడం నేనెప్పటికీ మర్చిపోలేను.ఇలాంటి వాటికోసమే మన భారతీయ సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను అని తారక్ తన పోస్ట్‌ లో రాసుకొచ్చారు ఎన్టీఆర్‌.

ఆ పోస్టులో సదరు యువతీ తెలుగు అక్షరమాల ఉన్న బుక్ ని తారక్ కి చూపించిన విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన వీడియో వైరల్ ఎన్టీఆర్ అభిమానులు అమ్మాయి తెలుగు చక్కగా మాట్లాడింది రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజా వార్తలు