క‌ళ్యాణ్‌రామ్ డైరెక్ట‌ర్‌తో యంగ్‌టైగ‌ర్‌ క్రేజీ ప్రాజెక్టు..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ‌రుస పెట్టి క్రేజీ సినిమాల్లోనే న‌టిస్తున్నాడు.రాజ‌మౌళితో చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే మ‌రో సినిమాలో న‌టిస్తున్నాడు.

 Young Tiger Ntr Next Movie With Kalyan Ram Director,rrr,ss Raja Mouli,ntr,ram Ch-TeluguStop.com

హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిన‌బాబు, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై తార‌క్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే ఎన్టీఆర్ కోసం అదిరిపోయే పొలిటిక‌ల్ థ్రిల్లింగ్ +  ఫ్యామిలీ అంశాల మేళ‌వింపుతో అదిరిపోయే స్టోరీ కూడా రెడీ చేశాడ‌ని తెలుస్తోంది.

ఈ రెండు సినిమాల త‌ర్వాత కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసే సినిమాకు ఓకే చెప్పాడు.మైత్రీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇప్ప‌టికే మైత్రీ వాళ్లు అటు ప్ర‌శాంత్‌నీల్‌కు, ఇటు ఎన్టీఆర్‌కు అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశార‌ని టాక్‌.కేజీఎఫ్ 2 కంప్లీట్ అయిన వెంట‌నే  ఎన్టీఆర్ సినిమాపై ప్ర‌శాంత్ వ‌ర్క్ స్టార్ట్ చేస్తాడు.

ఇదిలా ఉంటే వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌తో షాక్ ఇస్తోన్న ఎన్టీఆర్ మ‌రో క్రేజీ ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడ‌ట‌.

ఈ సారి త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ బ్యాన‌ర్లోనే ఈ సినిమా ఉంటుందంటున్నారు.

ప‌టాస్‌తో క‌ళ్యాణ్‌రామ్ అనిల్ రావిపూడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తే ఈ రోజు అనిల్ టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా ఉన్నాడు.అప్ప‌టి నుంచి క‌ళ్యాణ్‌రామ్ కోసం మ‌రో సినిమా చేయాల‌ని అనిల్ వెయిట్ చేస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అనిల్ ఏకంగా అదే క‌ళ్యాణ్ బ్యాన‌ర్లో ఎన్టీఆర్ హీరోగా  ఓ పాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నాడట‌.ఎన్టీఆర్ సినిమాలు కంప్లీట్ అయ్యేలోగా అనిల్ ఎన్టీఆర్ సినిమాకు క‌థ రెడీ చేసుకోవ‌చ్చని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube