నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది.తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది.తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ బయోపిక్ రూపంలో మనముందుకు వచ్చి అలరించారు.
ఇప్పటికే విడుదలైన కథానాయకుడు అందరిని ఆకట్టుకుంది.ఇక ఈ రోజు విడుదలైన మహానాయకుడు ఎలా ఉందో తెలుగుస్టాప్ సామీక్షలో చూసేద్దామా.?
Cast and Crew:నటీనటులు: బాలకృష్ణ, విద్య బాలన్, రానా, కళ్యాణ్ రామ్, తదితరులు దర్శకత్వం: క్రిష్నిర్మాత: బాలకృష్ణసంగీతం:కీరవాణి
కథ :
ఎన్ఠీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో ఈ సినిమా మొదలవుతుంది.రెండు రూపాయలకే కిలో బియ్యం పతకాన్ని ప్రకటిస్తారు.
ఇంతలో ఎన్నికల ప్రణాళిక రావడంతో తెరపైకి చంద్రబాబు నాయుడుగా రానా పరిచయమవుతారు.ఎన్నికల ప్రచారంలో ఎన్ఠీఆర్ ఎలక్ట్రిక్ షాక్ కి గురవుతారు.
ఆ తర్వాత ఇందిరా గాంధీ గారు తిరుపతి దర్శనం చేసుకునే సీన్ హైలైట్.చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోతారు.
రాజకీయాలు వదిలేద్దాము అనుకుంటారు.ఇంతలో ఒంటరిగా పార్టీ పెట్టి గెలిచిన రామ రావు గారు అల్లుడిని పిలిచి సీట్ ఇస్తారు.
రామారావు అమెరికాకి వెళ్లిన సమయంలో నాదెండ్ల ఇందిరా గాంధీని కలుస్తారు.వెంటనే రామారావుని రిజైన్ చేయమని ఆదేశిస్తారు.
నాదెండ్ల ముఖ్యమంత్రి పదవి చేపడతారు.
చైతన్య రధంతో మరోసారి అందరి గుర్తింపు సంపాదించి ముఖ్యమంత్రిగా మరోసారి గెలుస్తారు రామారావు గారు.చివరగా బసవతారకం మరణించడంతో ఈ సినిమా ముగుస్తుంది.
నటీనటుల ప్రతిభ.ఈ సినిమాకి బాలకృష్ణ నటన ప్రాణం పోసింది.తండ్రి పాత్రలో లీనమై ఎంతో గొప్పగా నటించాడు బాలయ్య.ఎన్టీఆర్ ఆహార్యంలో కాని , డైలాగ్ చెప్పడంలోకాని ఎన్టీఆర్ లా అచ్చు గుద్దినట్టు చేశాడు.ఇక బసవతారకమ్మగా విద్యా బాలన్ గొప్ప గా నటించింది.
ఏయన్నార్ గా సుమంత్ నటన చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.కళ్యాణ్ రాం హరికృష్ణ పాత్రలో రానా ,నారా చంద్రబాబుగా అచ్చుగుద్దినట్టు సరిపోయారు అంతేకాదు నటన పరంగా కూడా సెట్ అయ్యారు.
టెక్నికల్ గా:
ఎన్టీఆర్ జీవితంలోని భావోద్వేగ సన్నివేశాలకే దర్శకుడు క్రిష్ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది.తొలిభాగం, రెండో భాగం అనే తేడా లేకుండా సాయి మాధవ్ బుర్రా తన మాటలకు మరింత పదునుపెట్టాడు.
జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది.లైటింగ్, కలర్ ప్యాటర్న్ తదితర అంశాలు బాగున్నాయి.
అప్పటి వాతావరణాన్ని తెర మీదకు తీసుకువచ్చిన ఆర్ట్ విభాగం పనితీరు సూపర్ అని చెప్పవచ్చు.రామకృష్ణ ఎడిటింగ్ క్రిస్పిగా ఉంది.
నిర్మాణ విలువలు ప్రతిష్ఠాత్మకమైన రీతిలోనే ఉన్నాయి.
విశ్లేషణ :
జకీయ పార్టీ పెట్టిన క్రమంలో ఎన్టీఆర్ చేసే ప్రసంగాలు చాలా ఉద్వేగంగా తెరపైన కనిపించేలా ఉంటాయి.బసవతారకంకు క్యాన్సర్ వ్యాధి సోకిన సమయంలో ఎన్టీఆర్ ఎమోషనల్‌కు గురికావడం తొలిభాగానికి హైలెట్ అనిచెప్పవచ్చు.నాదెండ్ల ఎపిసోడ్ ప్రారంభమైన తర్వాత చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది.
అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రాక్ పక్కన పెట్టి చంద్రబాబు పాత్రను ఎలివేట్ చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ఎన్టీఆర్, బసవతారకం మధ్య ఎమోషనల్ సీన్స్సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్:
ఎన్టీఆర్ పాత్రపై కాకుండా చంద్రబాబుపై ఫోకస్ చేయడంసెకండ్ హాఫ్బయోపిక్ కంటే ఫామిలీ సినిమాలాగే తెరకెక్కించారుపాటలు
తెలుగుస్టాప్ రేటింగ్ :2.75/5
బోటం లైన్ – ఇది బయోపిక్ కంటే ఫామిలీ సినిమా అని చెప్పొచ్చు.కొన్ని సన్నివేశాల్లో చంద్రబాబు నాయుడు బయోపిక్ ఏమో అని కూడా డౌట్ వస్తుంది.
మొత్తానికి ఎన్టీఆర్ గురించి అభిమానులు తెలుసుకోవాలన్న కథను మాత్రం తెరకెక్కించలేదు.ఓవరల్‌గా భావోద్వేగాలు, చరిత్ర పలికిన సత్యాలు కొన్ని తెర మీద సాక్షాత్కరిస్తాయి.