మహానాయకుడు మొదటి రోజే తేలిపోయింది! డిజాస్టర్ కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగంగా వచ్చిన మహానాయకుడు సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలకమైన సంఘటనల ఆధారంగా ఈ రెండో భాగం ప్రేక్షకుల ముందుకి వచ్చిందనే విషయం అందరికి తెలిసిందే.

ఇప్పటికే ఎన్టీఆర్ లో మొదటి భాగం డిజాస్టర్ టాక్ తెచ్చుకొని భారీ నష్టాలు మిగిల్చింది.దీంతో దర్శకుడు క్రిష్, నిర్మాతలు మహానాయకుడుకి ఎక్కువ ఆర్బాటం చేయకుండా సైలెంట్ గా రిలీజ్ చేసారు.

అయితే సినీ ప్రముఖుల కోసం ఓ ప్రీమియర్ షో ని మాత్రం వేసారు.సెలబ్రిటీలు అందరూ మహానాయకుడు సినిమా చూసిన తర్వాత మొదటి భాగంని ఆకాశానికి ఎత్తేసినట్లే రెండో భాగాన్ని కూడా ఎత్తేసారు.

సినిమా చాలా అద్బుతంగా వుందని ప్రతి ఒక్కరు వాఖ్యానించారు.అయితే సెలబ్రిటీ టాక్ ఎలా వున్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులని కాని, సామాన్య ప్రేక్షకులని కాని ఎ మాత్రం ఆకట్టుకోలేదనే కలెక్షన్స్ బట్టి స్పష్టంగా తెలిసిపోతుంది.

Advertisement

మొదటి భాగం మీద వున్నా నెగిటివ్ టాక్ వలన రెండో పార్ట్ మీద ఆడియన్స్ ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.దీంతో పాటు ఎన్టీఆర్ లైఫ్ లో కీలక ఎపిసోడ్స్ ని లేపేయడంతో ఇక మహానాయకుడులో ఆసక్తికర అంశాలు ఏవీ ఉండవని ఫిక్స్ అయిపోయిన ఆడియన్స్ థియేటర్స్ వైపు చూసేందుకు పెద్దగా ఇష్టపడలేదు.

ఇక సినిమా రిలీజ్ తర్వాత టాక్ బట్టి చూద్దామని అనుకున్న వారికి కూడా మహానాయాకుడు రివ్యూ, పబ్లిక్ టాక్ నెగిటివ్ గానే వినిపించింది.ఇదిలా వుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ బాలయ్య కెరియర్ లో ఎన్నడూ ఊహించని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 1.66 కోట్లు మాత్రమె కలెక్ట్ చేసి బాలయ్య కెరియర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయేలా వుంది.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా కనీసం 5 కోట్లు కూడా కలెక్ట్ చేయడం కష్టం అనే అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు