'దేవర'లో వైల్డ్ క్యారెక్టర్.. మరో బాలీవుడ్ హీరోను దించబోతున్న కొరటాల!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర.

( Devara ) ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని తారక్ కంటిన్యూ చేయడానికి చాలానే కష్ట పడుతున్నాడు.

ఈ ఏడాది సమ్మర్ లోనే షూట్ స్టార్ట్ చేయగా ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది.షూటింగ్ కు పెద్దగా గ్యాప్ లేకుండా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.

ఈ ఏడాది లోనే షూట్ మొత్తం పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.దీంతో షూట్ కు అస్సలు గ్యాప్ అనేది ఇవ్వడం లేదు.ఇప్పటికే సగానికి పైగానే షూట్ పూర్తి చేసినట్టు టాక్.

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్( Guest Role ) ఉందని ఇది సినిమాకే కీలకమైన పాత్ర అని చాలా వైల్డ్ గా ఉంటుందని టాక్.అంతేకాదు ఈ పాత్ర చిన్నది అయినప్పటికీ సీక్వెల్ డ్రైవ్ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది.అందుకే ఈ రోల్ కోసం కొరటాల బాలీవుడ్ స్టార్ హీరోను( Bollywood Star Hero ) రంగంలోకి దించనున్నాడట.

పాన్ ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రను డిజైన్ చేసినట్టు టాక్.

ఇప్పటికే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) విలన్ రోల్ లో నటిస్తున్నాడు.ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో అంటే క్యాస్టింగ్ మరింత పెరిగి అంచనాలు కూడా పెరిగే అవకాశం ఉంది.మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో చూడాలి.

కాగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా.ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఇక 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.

Advertisement

తాజా వార్తలు