యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల విడుదల అయిన అన్నయ్య కళ్యాణ్ రామ్ సినిమా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న విషయం తెల్సిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు.అది ఒక డబ్బింగ్ సినిమా అవ్వడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అది కూడా ఒక హిందీ డబ్బింగ్ సినిమా.బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను సౌత్ ఇండియా లో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న బ్రహ్మాస్త్ర సినిమా ను ఎప్పటికప్పుడు భారీ ఎత్తున ప్రమోట్ చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమా కు సమర్పకుడు అవ్వడం వల్ల తెలుగు లో మంచి క్రేజ్ అయితే దక్కింది.
ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం రాజమౌళి స్వయంగా ఎన్టీఆర్ ను ఆహ్వానించాడని తెలుస్తోంది.
సినిమా సౌత్ ప్రమోషన్ బాధ్యతలు మొత్తం కూడా రాజమౌళి తీసుకున్నాడు.అందుకే తెలుగు లో మంచి క్రేజ్ దక్కేందుకు గాను రాజమౌళి ఈ ప్లాన్ చేశాడు అంటున్నారు.
విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా మరో బాహుబలి రేంజ్ సినిమా అంటున్నారు.భారీ ఎత్తున వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉన్న ఈ సినిమా రాజమౌళి సమర్పణలో వస్తుంది కనుక ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా ల స్థాయి లో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఈ సినిమా లో తెలుగు హీరో నాగార్జున కూడా నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.బ్రహ్మాస్త్ర సినిమా వచ్చే నెల రెండవ వారం లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే సక్సెస్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనో చూడాలి.