టెస్లా కంపెనీ CEO గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.అవును… ఎలన్ మస్క్ ఒక బిజినెస్ మేన్ గానే కాకుండా ఓ సెలిబ్రిటీ మాదిరి అందరికీ సుపరిచితుడే.నిరంతరం డేరింగ్ అండ్ డేషింగ్ నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో వుండే మాస్క్ అంటే నేటితరానికి ఎనలేని అభిమానం.అందుకే యూత్ పాలిట అతడు ఓ రోల్ మోడల్ అయ్యాడు.
అసలు విషయంలోకి వెళితే, రాబోయే స్టార్‌లింక్ V2 శాటిలైట్ సర్వీసు ద్వారా డెడ్ జోన్లలో మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్టు తాజాగా ప్రకటించి సంచలం సృష్టించాడు.తద్వారా టెస్లా కార్లకు స్టార్‌లింక్ ఇంటర్నెట్ కనెక్టవిటీ అందించనున్నారు.
అవును… టెస్లా కార్లలో శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులో రానుంది.ఇకపై టెస్లా కార్లు ఈ తరహా సర్వీసును అందిస్తాయని మస్క్ తాజాగా ధృవీకరించారు.
మీ ఫోన్ సిగ్సల్స్ అందక పని చేయనప్పుడు కూడా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చునని ఈ సందర్భంగా అన్నారు.అలాగే స్టార్‌లింక్ V2 వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శాటిలైట్ కనెక్షన్ ఏదైనా మెసేజ్ పంపడంలో లేదా స్వీకరించడంలో కొంత ఆలస్యాన్ని చేయవచ్చని యూజర్లు అంటున్నారు.సులభంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు.కానీ, వీడియో కాల్‌లు సరిగ్గా పని చేయవని అంటున్నారు.

ఇకపోతే ప్రతి సెల్ జోన్‌కు కనెక్టివిటీ 2 నుంచి 4 Mbits ఉంటుందని మస్క్ అన్నారు.అయితే తక్కువ బ్యాండ్‌విడ్త్ కారణంగా, ప్రజలు కాలింగ్ లేదా టెక్స్టింగ్ వంటి ప్రాథమిక ఫీచర్‌లను మాత్రమే ఇక్కడ వాడుకోగలరు.అసలు నెట్ వర్క్ లేదనేకంటే ఏదోఒక స్థాయిలో ఉంటే బెటర్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.డెడ్ జోన్‌లలో సున్నితమైన టెక్స్టింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు వాట్సాప్, imessage వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు T-Mobileతో కలిసి పని చేయాల్సి ఉంటుందని చెప్పారు.
అయితే T-Mobile సర్వీసు ఉచితంగా సర్వీసును అందిస్తుందా? లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







