నిన్న వెలువడిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి(NDA kutami) భారీ విజయాన్ని సాధించింది.అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం(CM) గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కూడా తనదైన రీతిలో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తో ఎమ్మెల్యే గా విజయాన్ని అందుకొని అసెంబ్లీకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే చంద్ర బాబు నాయుడు ఫ్యామిలీ నుంచి చాలా రోజులుగా దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ సైతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య లకి శుభాకాంక్షలు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు కనీసం అతని గురించి మాట అయిన మాట్లాడని ఎన్టీఆర్ ఇప్పుడు ఆయన గెలుపుని అభినందిస్తూ ఒక ట్వీట్ చేయడం అనేది మంచి విషయం అనే చెప్పాలి.అయితే ఎన్టీఆర్ కి బాలయ్య చంద్రబాబులకు మధ్య చాలా కొద్ది రోజుల నుంచి మాటలు లేనట్టుగా తెలుస్తుంది.అయినప్పటికీ అవేమీ మనసులో పెట్టుకోకుండా ఎన్టీయార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ (NTR ,Chandrababu Naidu, Balakrishna)లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళను అభినందించాడు.ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ చంద్రబాబు బాలయ్యలతో కలిసిపోయాడు అంటూ అభిమానులు కూడా చాలావరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక వీళ్లంతా కలిసి ఉంటే చూడడానికి నందమూరి ఫ్యాన్స్(Nandamuri fans) ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.అయినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం వీళ్లేవరిని పట్టించుకోకుండా తనకు తాను ఒక్కడే ఒంటరిగా ఉండిపోతున్నాడు అంటూ అతని మీద కొద్ది రోజుల క్రితం చాలా వార్తలైతే వచ్చాయి.కానీ ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బాలయ్య అందరూ కలిసి పోయినట్టుగా తెలుస్తుంది చూడాలి మరి వీళ్ళ మధ్య అనుబంధం ఇంకా బలపడుతుందా లేదంటే ఇక్కడి వరకే పరిమితమవుతుందా అనేది…
.







