సినిమా పరిశ్రమలో విజయవంతమైన కెరీర్ తో ఒక వెలుగు వెలిగిన నటీమణులు ఎందరో ఉన్నారు.వారిలో సావిత్రి( Savitri ) పేరు మొదటగా వినిపిస్తుంది.
ఈ ముద్దుగుమ్మ చక్కటి హావభావాలతో అద్భుతమైన నటనతో తెలుగువారి హృదయాలను దోచేసింది.అయితే సినిమాలపరంగా ఆమె జీవితం సాఫీగా సాగింది కానీ పర్సనల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించింది.
ముఖ్యంగా ఆల్రెడీ పెళ్లయిన జెమినీ గణేషన్ ని( Gemini Ganeshan ) పెళ్లి చేసుకుని నరకం అనుభవించింది.నిజానికి గణేషన్‌ను పెళ్లి చేసుకోవద్దని అప్పటి స్టార్ హీరోలు ఏఎన్నార్, ఎన్టీఆర్లు సావిత్రికి చాలా చెప్పి చూశారు.
పెళ్లయిన వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుపడవని హెచ్చరించారు.అయినా సావిత్రి చాలా మొండిదై ఉండటం వల్ల వారి మాటలు వినకుండా జెమినీ గణేషన్‌ను పెళ్లాడింది.తర్వాత అతడి నిజస్వరూపం తెలుసుకుని మానసికంగా ఎంతో కృంగిపోయింది.సినిమాలు చేయకుండా తాగుడుకు బానిస అయి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది.
చివరి రోజుల్లో ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారింది.అయితే ఈ సమయంలో ఆమెకు ఎక్కడ ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుందేమో అని భయపడి ఆమెతో కలిసి నటించిన చాలామంది కనిపించకుండా తిరిగేవారు.

ఏఎన్ఆర్,( Akkineni Nageswara Rao ) ఎన్టీఆర్లు( Sr NTR ) కూడా ఇలాగే ప్రవర్తించే వారిని అప్పట్లో ప్రచారం జరిగేది.ఆ ప్రచారమే నిజమని ఇప్పటికీ ప్రజలు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో అసలు నిజం బయటపడింది.అదేంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు సావిత్రి అంటే చాలా ఇష్టం ఉండేదట.వారు ఆమెకు డబ్బులు ఇవ్వాలని ఎప్పుడూ అనుకునే వారట.కానీ సావిత్రి చాలా ఆత్మ గౌరవం ఉన్న మహిళ అని, ఊరికినే డబ్బులు ఇచ్చేస్తే తీసుకునే మనస్తత్వం ఆమెకు లేదని వారు వెనక్కి తగ్గే వారట.
తాము ఇచ్చినట్లు చెబితే సావిత్రి అసలు తీసుకోలేదని భావించి, వారు ఇతరుల చేత ఇప్పించేవారట.అది కూడా సావిత్రి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బే ఇస్తున్నట్లు ఆ ఇతరుల చేత చెప్పించేవారు.

అందువల్ల ఇద్దరు దిగ్గజ నటులు ఆమెకు సహాయం చేశారని ఎవరికీ తెలియకుండా పోయింది.చివరికి బయటపడింది కానీ చాలామంది వారిని అపార్థం చేసుకున్నారు.ఈ విషయం చనిపోయే వరకు సావిత్రికి కూడా తెలియకపోవడం గమనార్హం.ఏది ఏమైనా సావిత్రి చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు చాలా బాధపడ్డారట.ఆమెలాగా ఎవరూ తప్పటడుగులు వేయకూడదని, ఆమె జీవితమే గుణపాఠంగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని కొత్త హీరోయిన్లకు చెప్పేవారట.