భారత్ వేదికగా అక్టోబర్ ఐదు న వన్డే వరల్డ్ కప్( Odi World Cup ) ప్రారంభం అవ్వనున్న సంగతి అందరికీ తెలిసిందే.వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నా కూడా క్రికెట్ నిపుణులు ఏ జట్లు సెమీఫైనల్ కు చేరుతాయో జోస్యం కూడా చెప్పారు.
ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇంత జరుగుతున్న ఇప్పటికీ పాకిస్తాన్( Pakistan ) వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనేది స్పష్టత లేదు.
ఆసియా కప్( Asia Cup ) షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది.ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత్( India ) ఎట్టి పరిస్థితులలో పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని తేల్చి చెప్పడంతో హైబ్రిడ్ మోడల్ అనే కొత్త కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది.దీంతో పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్లు, శ్రీలంకలో 9 మ్యాచులు జరిపించనున్నారు.ఈ హైబ్రిడ్ మోడల్ తో పాకిస్తాన్ కు ఎటువంటి లాభం లేదని పాకిస్తాన్ కాబోయే క్రికెట్ చైర్మన్ జకా అస్రఫ్ తెలిపాడు.
ఆసియా కప్ కోసం భారత్ పాకిస్తాన్ కు రాకపోతే.వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ భారత్ కు వచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది.ఒకవేళ పాకిస్తాన్ ఈ టోర్నీలో పాల్గొనకపోతే స్కాట్లాండ్ కు( Scotland ) అవకాశం దక్కుతుంది.
క్వాలిఫయర్ మ్యాచ్లలో స్కాట్లాండ్ టాప్-3 లో నిలిచింది.కాబట్టి పాకిస్తాన్ స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం దక్కుతుంది.
ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.