ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజా పోరాటాల విషయంలో తీవ్ర స్థాయిలో పోరాడుతున్నాయి.చాలా ప్రతిపక్ష పార్టీలు ప్రజలలో ఉంటూ ప్రశ్నించాల్సిన విషయంపై వైసీపీ ప్రభుత్వాన్ని ( YCP ) కడిగిపారేస్తున్నాయి.
ఈ క్రమంలో ఎవరికి వారు పలు కార్యక్రమాలతో నిత్యం ప్రజలలో ఉంటున్నారు.ఈ రకంగానే ప్రధప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ “భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమంతో వచ్చే ఎన్నికల్లో హామీలను ప్రజలకు వివరిస్తూ ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన “మహానాడు” కార్యక్రమంలో తొలి దశ మేనిఫెస్టోలో చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రకటించిన హామీలను ఏపీవ్యాప్తంగా టీడీపీ నేతలు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు.
అయితే ఈ ‘భవిష్యత్తు గ్యారంటీ’( Bhavishyathu Guarantee ) కార్యక్రమం పై విజయ్ సాయి రెడ్డి( Vijay Sai Reddy ) ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.“హాయిగా ఉన్న రాష్ట్ర ప్రజలకు టీడీపీ కొత్తగా ఇవ్వగలిగే ‘భవిష్యత్తు గ్యారంటీ’ ఇంకేముంటుంది? ఫస్ట్ తారీఖునే పెన్షన్లు చేతికి అందుతున్నాయి.రైతులకు, విద్యార్థులకు, ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి, కార్మికులకు, చేతి వృత్తుల వారికి పథకాలున్నాయి.32 లక్షల కుటుంబాలకు జగన్ గారు ఇళ్ల స్థలాలు కేటాయించారు.చీకూ చింతాలేని భవిష్యత్తు అంటే ఇదే కదా?” అంటూ ట్వీట్ చేయడం జరిగింది.