అంతరించిపోతున్న ఈ భాషల గురించి మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది భాషలు ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉన్నాయి.యునెస్కో తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో 577 భాషలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.ఇందులో భారతదేశంలోని 42 భాషలు ఉన్నాయి.

 Interesting Facts About Indian Languages Details, Languages, Indian Languages, I-TeluguStop.com

అండమానీస్

ఈ భాషను అకా జెరు లేదా జెరూ అని కూడా అంటారు.మధ్య, ఉత్తర అండమాన్‌లో ఒకప్పుడు ప్రబలంగా ఉన్న ఈ భాషను ఇప్పుడు ఐదుగురికి మాత్రమే తెలుసట.

సెంటినెల్

అండమాన్ దీవుల్లో మాట్లాడే సెంటినెల్ భాష కూడా చనిపోయే దశకు చేరుకుంది.ఇప్పుడు మాట్లాడే వారి సంఖ్య 50 కంటే తక్కువగా ఉంది.

ఒంగే

ఒంగే భాష మాట్లాడే వారి సంఖ్య 50 వరకూ ఉంటుందని విశ్వసిస్తున్నట్లు యునెస్కో చెబుతోంది.అయితే వాస్తవ సంఖ్య దీని కంటే చాలా తక్కువగా ఉండవచ్చంటున్నారు.

Telugu Andamanese, Languages, Pooram, Sentinel, Tai Nora, Tangam, Tarav, Unescon

లామోంగీస్

లిటిల్ నికోబార్, కొండుల్ దీవులలో లామోంగీస్ భాష మాట్లాడుతుంటారు.కానీ ఇప్పుడు ఈ బాషలో మాట్లాడేందుకు 400 మంది మాత్రమే మిగిలారు.

తారావ్

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లోని చందేల్, ఉఖ్రుల్ జిల్లాలలో తారావ్ భాష మాట్లాడుతుంటారు.2001 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు 870 మంది మాత్రమే తారావో భాష మాట్లాడుతున్నారు.

పూరం

మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని ఫిజోల్, లైకోట్, తుయిసేనాపై, ఖరం పాలెన్ గ్రామాలలో ఈ భాష మాట్లాడుతుంటారు.ఇప్పుడు ఈ భాష మాట్లాడేవారు 503 మంది మాత్రమే మిగిలి ఉన్నారట.

Telugu Andamanese, Languages, Pooram, Sentinel, Tai Nora, Tangam, Tarav, Unescon

తంగం

ఈ భాష మాట్లాడే ప్రజలు అరుణాచల్ ప్రదేశ్‌లోని తంగం గ్రామంలో నివసిస్తున్నారు.దీనికి ఒక మహనీయుని పేరు పెట్టారు.ఈ బాష మాట్లాడే వారి సంఖ్య దాదాపు 100.

తాయ్ నోరా

ఈ భాషను ఖమ్యాంగ్ అని కూడా అంటారు.అస్సాంలోని తిన్సుకియా జిల్లా పొవైముఖ్ గ్రామంలో దాదాపు 100 మంది ప్రజలు ఈ భాషలో మాట్లాడుతున్నారు.

తాయ్ రాంక్

అస్సాంలోని జోర్హాట్ పరిసర ప్రాంతంలో ఇప్పుడు 100 మంది మాత్రమే తాయ్ లాంగ్ భాష మాట్లాడుతున్నారు.అందుకే దీనిని యునెస్కో కనుమరుగవుతున్న భాషల జాబితాలో చేర్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube