అంతరించిపోతున్న ఈ భాషల గురించి మీకు తెలుసా?
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది భాషలు ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉన్నాయి.యునెస్కో తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో 577 భాషలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఇందులో భారతదేశంలోని 42 భాషలు ఉన్నాయి.h3 Class=subheader-styleఅండమానీస్/h3p
ఈ భాషను అకా జెరు లేదా జెరూ అని కూడా అంటారు.
మధ్య, ఉత్తర అండమాన్‌లో ఒకప్పుడు ప్రబలంగా ఉన్న ఈ భాషను ఇప్పుడు ఐదుగురికి మాత్రమే తెలుసట.
H3 Class=subheader-styleసెంటినెల్/h3p
అండమాన్ దీవుల్లో మాట్లాడే సెంటినెల్ భాష కూడా చనిపోయే దశకు చేరుకుంది.
ఇప్పుడు మాట్లాడే వారి సంఖ్య 50 కంటే తక్కువగా ఉంది.h3 Class=subheader-styleఒంగే/h3p
ఒంగే భాష మాట్లాడే వారి సంఖ్య 50 వరకూ ఉంటుందని విశ్వసిస్తున్నట్లు యునెస్కో చెబుతోంది.
అయితే వాస్తవ సంఖ్య దీని కంటే చాలా తక్కువగా ఉండవచ్చంటున్నారు. """/"/
H3 Class=subheader-styleలామోంగీస్/h3p
లిటిల్ నికోబార్, కొండుల్ దీవులలో లామోంగీస్ భాష మాట్లాడుతుంటారు.
కానీ ఇప్పుడు ఈ బాషలో మాట్లాడేందుకు 400 మంది మాత్రమే మిగిలారు.h3 Class=subheader-styleతారావ్/h3p
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లోని చందేల్, ఉఖ్రుల్ జిల్లాలలో తారావ్ భాష మాట్లాడుతుంటారు.
2001 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు 870 మంది మాత్రమే తారావో భాష మాట్లాడుతున్నారు.
H3 Class=subheader-styleపూరం/h3p
మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని ఫిజోల్, లైకోట్, తుయిసేనాపై, ఖరం పాలెన్ గ్రామాలలో ఈ భాష మాట్లాడుతుంటారు.
ఇప్పుడు ఈ భాష మాట్లాడేవారు 503 మంది మాత్రమే మిగిలి
ఉన్నారట. """/"/
H3 Class=subheader-styleతంగం/h3p
ఈ భాష మాట్లాడే ప్రజలు అరుణాచల్ ప్రదేశ్‌లోని తంగం గ్రామంలో నివసిస్తున్నారు.
దీనికి ఒక మహనీయుని పేరు పెట్టారు.ఈ బాష మాట్లాడే వారి సంఖ్య దాదాపు 100.
H3 Class=subheader-styleతాయ్ నోరా/h3p
ఈ భాషను ఖమ్యాంగ్ అని కూడా అంటారు.అస్సాంలోని తిన్సుకియా జిల్లా పొవైముఖ్ గ్రామంలో దాదాపు 100 మంది ప్రజలు ఈ భాషలో మాట్లాడుతున్నారు.
H3 Class=subheader-styleతాయ్ రాంక్/h3p
అస్సాంలోని జోర్హాట్ పరిసర ప్రాంతంలో ఇప్పుడు 100 మంది మాత్రమే తాయ్ లాంగ్ భాష మాట్లాడుతున్నారు.
అందుకే దీనిని యునెస్కో కనుమరుగవుతున్న భాషల జాబితాలో చేర్చింది.