329 మందిని బలిగొన్న విషాదం.. కనిష్క విమాన ప్రమాదంపై సిట్‌ ఏర్పాటు చేయండి: మోడీకి ఎన్ఆర్ఐల విజ్ఞప్తి

1985లో 329 మందిని పొట్టనబెట్టుకున్న కనిష్క విమాన ప్రమాదానికి 36 ఏళ్లు నిండాయి.ఈ నేపథ్యంలో నాటి ప్రమాద మృతులకు వారి బంధువులు, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కనిష్క విమాన ప్రమాదంపై దర్యాప్తుకు సుప్రీంకోర్ట్ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయాలని ఇండో కెనడియన్లు, ఎన్ఆర్ఐలు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.36 ఏళ్ల క్రితం 1985, జూన్ 23న ఎయిరిండియా విమానం 182లో బాంబు పేలుడు కారణంగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది.ఈ ప్రమాదంలో అందులో వున్న 329 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు.

కెనడాకు చెందిన సిక్కు మిలిటెంట్లు, ప్రధానంగా బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ గ్రూప్ సభ్యులు.ప్రత్యేక ఖలిస్తాన్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.

అయితే ప్రమాదం జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం జరగడం లేదు.విమానం ఎక్కడి నుంచి బయల్దేరింది.? దాడికి పాల్పడిన అనుమానితులు ఎక్కడున్నారు.? వంటి అంశాలు నేటీకి సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.ఈ ప్రమాదంపై ఏర్పాటైన జస్టిస్ జాన్ మేజర్ కమీషన్ బాధితుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా సిఫారసు చేసింది.1985 నాటి ఎయిర్ ఇండియా ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం.ప్రతి వ్యక్తికి 5,00,000 డాలర్లు చెల్లించాలని సూచించింది.

కానీ దీనిని ఎయిరిండియా ఇంత వరకు చెల్లించలేదు.సెప్టెంబర్ 11, 2001 వరకు విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా Air India Flight 182 ఘటన నిలిచింది.

Advertisement

నాటి ఘటనలో 82 మంది పిల్లలు, ఆరుగురు శిశువులు, సిబ్బంది సహా 329 మంది ప్రాణాలు కోల్పోయారు.వీరిలో 268 మంది కెనడా జాతీయులు కాగా.24 మంది భారతీయులు, 27 మంది బ్రిటీష్ పౌరులు, సిబ్బంది వున్నారు.ఈ ఘటన జరిగిన 36 ఏళ్ల కాలంలో కేవలం ఒక్కరిని మాత్రమే కెనడా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దోషిగా నిర్ధారించారు.

అధికార పరిధి, కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఈ విమాన ప్రమాదం విచారణ పక్కదారి పట్టింది.ఎక్కువ మంది బాధితులు, అనుమానితులు కెనడా జాతీయులే.విమానం కూలిన ప్రదేశం ఐరీష్ తీర ప్రాంతంలో వుండటం కూడా విచారణకు అవరోధంగా మారింది.

Advertisement

తాజా వార్తలు