రియల్‌ ఎస్టేట్‌‌లో ఎన్ఆర్ఐల పెట్టుబడులు: దక్షిణాదిపైనే ఫోకస్, టాప్‌లో కర్ణాటక

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఎప్పటికైనా స్వదేశంలో ఇల్లు లేదా ఆస్తులు వుంటే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు.

దీనిలో భాగంగా తాము ఇప్పటి వరకు కూడబెట్టిన డబ్బుతో సొంత వూరిలో ఇల్లు, పొలం కొనేందుకు ముందుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయుల్లో 75 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల కోసం దక్షిణ భారతదేశాన్నే ఎంచుకున్నారని క్వికర్ ఫ్లాట్‌ఫామ్ తెలిపింది.ఇందులో కర్నాటక (31శాతం) అగ్రస్థానంలో నిలవగా.

ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (20శాతం), కేరళ (11శాతం), తెలంగాణ (9శాతం) వున్నాయి.మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు విదేశాల్లో స్థిరపడినా, ఈ జాబితాలో ఆ రాష్ట్రానికి చోటు లభించకపోవడం గమనార్హం.

ఇక రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలో ఉన్నవారు అధికంగా ఆసక్తి చూపిస్తుండగా, తర్వాత స్థానాల్లో యూఏఈ, బ్రిటన్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు వున్నారు.దేశ ఐటీ రాజధాని బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గగా, కొన్నిచోట్ల పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

Advertisement

ఇదే సమయంలో పుణె, హైదరాబాద్‌, ఢిల్లీ, చైన్నెలలోనూ స్థిరాస్తి ధరల్లో కొంత తగ్గుదల కన్పించినట్లు క్వికర్ పేర్కొంది.ఇళ్లను, ఫ్లాట్లను అమ్మేందుకు బిల్డర్లు, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు పలు రాయితీలు, ఆఫర్లు ప్రకటించడమే ఇందుకు కారణమని తెలిపింది.ఎన్‌ఆర్‌ఐలలో 29 శాతం మంది ప్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపగా.45 శాతం మంది అపార్ట్‌మెంట్‌/విల్లాల కోసం ఆసక్తి చూపారు.ఇందులో 82 శాతం మంది అప్పటికప్పుడు రెడీగా వున్న ఆస్తుల కొనుగోలుకు ఇష్టపడ్డారని సర్వేలో తేలింది.

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగ, వ్యాపార అవకాశాలు దెబ్బతిన్నాయి.ఇతర దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే భారతీయులు కరోనా కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.దీంతో అనుకోని విపత్తులు ఎదురైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న చాలామందిని ఆలోచింపజేసింది.

మరోవైపు రూపాయి విలువ తగ్గడంతో రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడి మార్గంగా ఎంపిక చేసుకోవాలని ఎన్ఆర్ఐలు భావిస్తున్నారు.డెవలపర్లు కూడా ఈ డిమాండ్ ను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఫలితంగా భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతోంది.

కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా స్థిరాస్థి రంగం మందగించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు మళ్లీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు