కుక్కకు పిండ ప్రదానం, గంగలో అస్ధికల నిమజ్జనం: ప్రేమను చాటుకున్న ఎన్ఆర్ఐ ఫ్యామిలీ

కుక్కలు విశ్వాసానికి మారు పేరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కాస్త ఆదరిస్తే చాలు యజమానికి ప్రాణం ఇచ్చేస్తాయి.

మనిషి పుట్టుక నుంచి నేటి వరకు కేవలం పెంపుడు జంతువుగానే కాకుండా స్నేహితునిగా మారిన ఒకే ఒక్క జంతువు కుక్క.అలా తమ కుటుంబంలో మనిషిగా కలిసిపోయిన కుక్క మరణించడంతో దానికి పిండ ప్రదానం చేసి తమ గొప్ప మనసు చాటుకుంది ఓ ఎన్ఆర్ఐ కుటుంబం.

బీహార్‌ రాష్ట్రం పూర్నియాకు చెందిన ప్రమోద్ చౌహాన్ అతని భార్య రేఖ, కుమార్తె విష్ణుప్రియతో కలిసి న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో స్థిరపడ్డారు.వీరి ఇంట్లో లైకెన్ అనే ఓ పెంపుడు కుక్క ఉంది.

అదంటే వీరికి పంచ ప్రాణాలు.ఈ క్రమంలో లైకెన్ ఇటీవల క్యాన్సర్‌తో మరణించింది.

Advertisement

దానికి న్యూజిలాండ్‌లోనే దహన సంస్కారాలు నిర్వహించారు.అయితే దానిని ఇంట్లో మనిషిగా భావించే ప్రమోద్ చౌహాన్ దాని ఆత్మకు శాంతి కలిగించాలని భావించారు.

సాధారణంగా గయలో శ్రాద్ధ కర్మలు నిర్వహించి అస్థికలను గంగానదిలో కలిపితే మరణించిన వారికి సద్గతి లభిస్తుందని హిందువుల విశ్వాసం.

దీనిలో భాగంగా లైకెన్‌కు గయలో పిండ ప్రదానం చేయించి , అస్ధికలను గంగానదిలో కలపాలని ప్రమోద్ నిర్ణయించి వెంటనే భారతదేశానికి బయల్దేరారు.ఫిబ్రవరి 13న పాట్నాకు చేరుకున్న వీరి కుటుంబసభ్యులు ఆ మరుసటి రోజు పడవలో గయ చేరుకుని పిండ ప్రదానం నిర్వహించారు.అనంతరం లైకెన్ అస్ధికలను సోనేపూర్‌లోని పవిత్ర గంగా నదిలో కలిపారు.

అక్లాండ్‌లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ప్రమోద్ క్యాన్సర్‌ రోగుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థకు సహకరిస్తున్నారు.భారత పర్యటనలో భాగంగా ఆయన పూర్ణియా మధుబని మొహల్లాలోని సిపాహి తోలాలోని తన పూర్వీకుల ఇంట్లో ఉంటున్నారు.అక్కడ ఈ నెల 23న లైకెన్ సంస్మరణార్థం సంతాప సభ నిర్వహించనున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు