కోవిడ్ ఎఫెక్ట్: విమానం ఎక్కడానికి ఇన్ని కష్టాలా.... భారత్‌ నుంచి దుబాయ్‌కి అక్షరాలా రూ.55 లక్షలు

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.

పరాయి దేశం పొమ్మంటుంటే.అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు.

ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఎన్నో సంఘటనలు గతేడాది జరిగాయి.అయితే భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక విమానాలు నడిపి లక్షలాది మంది ప్రవాసుల్ని స్వదేశానికి తీసుకొచ్చింది.2020, మే 6న 64 విమానాలు, 12,800 మంది ప్రయాణికులతో ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమైంది.నాటి నుంచి మార్చి 2 వరకు దాదాపు 60 లక్షల మంది ప్రవాసుల్ని స్వదేశానికి తీసుకువచ్చామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.

అయితే ఓ పక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా, టీకాలు అందుబాటులోకి వస్తున్నా ప్రపంచంపై కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదు.నిత్యం ఏదో ఓ మూలన ఆ మహమ్మారి విజృంభిస్తూనే వుంది.

Advertisement

వీటికి కొత్తగా మ్యూటేషన్ చెందిన వైరస్‌ అదనం.వివిధ దేశాల్లో కొత్తగా వెలుగులోకి వస్తున్న మార్పు చెందిన కరోనా.

ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేస్తోంది.ప్రస్తుతం భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వుంది.

నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు గాను ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌తో పాటు కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

కానీ పరిస్ధితుల్లో ఏమాత్రం మార్పు లేదు.కేసులు రాకెట్ వేగంతో పెరిగిపోతున్నాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అటు భారత్‌లోని భయానక పరిస్ధితుల నేపథ్యంలో అక్కడి వేరియెంట్ తమ దేశంలో ప్రవేశించకుండా పలు దేశాలు విమాన ప్రయాణాలు నిషేధించాయి.ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన నిషేధం ఎన్ని విమర్శలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్కనక్కర్లేదు.హద్దు మీరి స్వదేశంలో అడుగు పెడితే జైలు శిక్షతో పాటు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Advertisement

ఆ నిషేధం ముగిసిందనుకోండి.ఈ సంగతి పక్కనబెడితే.

గ‌ల్ఫ్ దేశాలు సైతం భారత్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.దీంతో వివిధ ప‌నులపై గ‌ల్ఫ్ నుంచి భారత్‌కు వచ్చినవారు.

గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు రావాల్సిన వారు చిక్కుకుపోయారు.ఇక‌ త‌ప్ప‌నిప‌రిస్థితుల్లో వెళ్లాల్సిన వారు ప్రైవేట్ విమానాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

ఇది భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో సంపన్నులు తప్ప.సామాన్యులు అటువైపు తొంగి చూడటం లేదు.

తాజాగా అస్సాంకు చెందిన‌ వ్యాపారవేత్త, జమియత్ ఉలామా అస్సాం అధ్య‌క్షుడు ముష్తాక్ అన్ఫర్ లక్షల రూపాయలు వెచ్చించి దుబాయ్ వెళ్లారు.అనారోగ్యం బారినపడిన తన త‌ల్లిని పరామర్శించేందుకు అన్ఫర్ ఫ్యామిలీతో క‌లిసి ఇటీవ‌ల దుబాయ్ నుంచి భార‌త్‌కు వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో ఇక్క‌డ సెకండ్ వేవ్ విజృంభణ మొదలైంది.దాంతో యూఏఈ స‌హా ప‌లు గ‌ల్ఫ్ దేశాలు భార‌త్ నుంచి విమానాల‌ రాకపై నిషేధం విధించాయి.

ఈ పరిణామంతో అన్ఫ‌ర్ భారత్‌లోనే చిక్కుకుపోయారు.అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న అన్ఫ‌ర్‌కు బిజినెస్ ప‌నుల నిమిత్తం వెంట‌నే దుబాయ్ వెళ్లాల్సి వ‌చ్చింది.

విమానాలపై నిషేధం వుండటంతో ఆయన భార్య‌, కుమారుడు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గౌహ‌తి నుంచి ఓ ప్రైవేట్ విమానంలో దుబాయ్ వెళ్లారు.దీనికోసం అన్ఫర్ ఏకంగా రూ.55 ల‌క్ష‌లు ఖర్చు చేశారు.ఈ విషయం ప్రస్తుతం ఇరు దేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా వార్తలు