కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు .. వాళ్ల పరిస్థితి ఏంటి ?

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్( Congress ) లో చేరిన ఎమ్మెల్యేలకు కష్టాలు మొదలైనట్టుగానే కనిపిస్తున్నాయి.2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఓటమి చెందడంతో , ఆ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్( BRS ) కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లోకి ఫిరాయించారు.

దీంతో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదిమందికి తెలంగాణ హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.

వీరితోపాటు స్పీకర్ , తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి,  భారత ఎన్నికల సంఘం కార్యదర్శి కి కూడా నోటీసులు జారీ చేస్తూ అక్టోబర్ 4వ తేదీలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ పిటిషన్ దాఖలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్( Dr K A Paul ) మొత్తం పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తదుపరి అసెంబ్లీ కార్యక్రమాలలో పాల్గొనకూడదని కోరారు.వారి అధికారాన్ని ఉపయోగించకూడదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు.రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లో ప్రకటించబడిన నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు( Telangana State Assembly Sessions ) ఎప్పుడు జరుగుతున్నాయో అనే విషయాన్ని పిటిషనర్ కోర్టుకు తెలియజేయలేనందున ఆ అభ్యర్థనను డివిజన్ బెంచ్ తిరస్కరించింది.

Advertisement

నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలు వీరే.ఖైరతాబాద్ దానం నాగేందర్,  గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,  స్టేషన్ ఘన్  పూర్  కడియం శ్రీహరి,  భద్రాద్రి కొత్తగూడెం తెల్లం వెంకట్రావు,  బాన్సువాడ పోచారం  శ్రీనివాసరెడ్డి,  చేవెళ్ల కాలే యాదయ్య , రాజేంద్రనగర్ టి ప్రకాష్ గౌడ్,  జగిత్యాల ఎం సంజయ్ కుమార్ , పఠాన్ చెరువు గూడెం మహిపాల్ రెడ్డి , శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ.దీంతో ఈ పదిమంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

  వారిపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో, వారు హైకోర్టుకు ఏం సమాధానం చెబుతారు ? దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది అక్టోబర్ 4 తర్వాతే తేలనుంది.

Advertisement

తాజా వార్తలు