''విజయ్ 66''లో మరో బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.

ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఇక ఇప్పుడు ఈయన తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.

తాజాగా విజయ్ నటించిన సినిమా బీస్ట్.ఈ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.

ఇక ఆ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని అఫిషియల్ గా కూడా ప్రకటించడమే కాకుండా పూజా కార్యక్రమాలతో షూట్ కూడా మొదలు పెట్టేసారు.

Advertisement
Noted Actress Is Not A Part Of Thalapathy 66, Dil Raju, Rashmika Mandanna, Thapa

వంశీ మొదటిసారి ఒక బై లాంగువల్ సినిమాను ఓకే చెయ్యగా దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.లేటెస్ట్ గా ఈ సినిమాపై మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో రష్మిక మందన్న తో పాటు మరో హీరోయిన్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.

Noted Actress Is Not A Part Of Thalapathy 66, Dil Raju, Rashmika Mandanna, Thapa

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెహ్రీన్ పిర్జాదా కూడా నటిస్తుంది అంటూ వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.అయితే ఇప్పుడు ఈ రూమర్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు.అసలు ఈ సినిమా కాస్ట్ లో ఈమె లేదని.

అవన్నీ రూమర్స్ మాత్రమే అని.ఈ సినిమాలో కేవలం ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంది అని క్లారిటీ ఇచ్చారు.దీంతో మెహ్రీన్ నటిస్తుంది అనే వార్తలపై క్లారిటీ వచ్చినట్టు అయ్యింది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు