దివంగత నేత నోముల నర్సింహయ్య అకాల మరణం తరువాత నాగార్జున సాగర్ నియోజకవర్గం నిత్యం వార్తల్లో నిలుస్తోంది.అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అధికార పార్టీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారు? నోముల కుటుంబానికి టిక్కెట్ ఇస్తారా లేదా?.కాషాయ పార్టీ ఎవరిని బరిలో నిలపనుంది.కాంగ్రెస్ పార్టీ నుంచి జానా రెడ్డి పోటీ చేస్తారా లేదా? అనే వార్తలు నిత్యం వినిపిస్తున్నాయి.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి నిత్యం ఏదోక వార్త వైరల్ అవుతునే ఉంది.నోముల కుటుంబానికే గులాబీ బాస్ టిక్కెట్ కన్ఫామ్ చేస్తారని.
లేదు లేదు.దుబ్బాక సీన్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు ఈ సారి బలమైన నేతను బరిలోకి దింపేలా గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారనే వార్తలు ముఖ్యంగా వినిపిస్తున్నాయి.
అయితే నోముల కుటుంబానికి టిక్కెట్ ఇవ్వాలా వద్దా అనే విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఫైనల్ డెసీషన్ తీసుకోవాల్సి ఉంది.నోముల కుటుంబానికే టిక్కెట్ ఇస్తే పోటీ చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నట్లు నోముల కుమారుడు భగత్ ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చేశారు.
కానీ నోముల కుటుంబానికి టిక్కెట్ ఇవ్వరనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఉప ఎన్నికను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంటోంది.దుబ్బాక విజయాన్ని మళ్లీ ఈ ఉప ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని కమలనాథులు భావిస్తుంటే, గత ఎన్నికల్లో చేజారిన స్థానాన్ని ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.స్థానికంగా అక్కడ బలమైన నేతను ఎన్నికల్లో నిలబెట్టి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి బరిలోకి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల కుటుంబానికే టిక్కెట్ ఇస్తే గెలుస్తామా? లేక దుబ్బాక తరహాలోనే ప్లాన్ బెడిసి కొడుతుందా అనే అనుమానాలను అధికార పార్టీ పెద్దలు వ్యక్తం చేస్తున్నారట.
ఇలాంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒకవేళ నోముల కుటుంబానికి టిక్కెట్ ఇవ్వలేకపోతే నోముల కుటుంబాన్ని ఎలా బుజ్జగించాలనే అంశంపై టీఆర్ఎస్ పార్టీ సమాలోచనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.నోముల కుటుంబానికి ఏదైనా నామినేటెడ్ పదవినిచ్చి వారిని బుజ్జగించి పోటీలో లేకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.
అయితే చివరికి టిక్కెట్ ఎవరికి దక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మ
.