‘కారు’ కూతలు రావు.. ‘జుటా’ మాటలు లేవు..: రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.చేతిగుర్తు తమ చిహ్నమన్న ఆయన చేసి చూపించడమే తమ నైజమని పేర్కొన్నారు.

ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కర్ణాటక ప్రజలకు ఇచ్చిన ఐదు హామీల్లో నాలుగు నెరవేర్చామని తెలిపారు.‘కారు’ కూతలు రావు.

No Words For 'car'.. No Words For 'juta'..: Revanth Reddy-‘కారు’ క

‘జుటా’ మాటలు లేవని చెప్పారు.తమ మాట శిలాశాసనమని, తమ బాట ప్రజా సంక్షేమం అని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని వెల్లడించారు.అదేవిధంగా విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రం 13 వేల పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పారని విమర్శించారు.

Advertisement

ఇన్ని ఖాళీలు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్లు మాత్రం ఐదు వేల పోస్టులకే ఇస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వం ప్రకటించింది మెగా డీఎస్సీ కాదన్న ఆయన ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ అని దుయ్యబట్టారు.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు