నాని దసరాలో నో రొమాన్స్.. మహానటి కూడా కీలక పాత్రలో?

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం నాని అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయి చిత్రాలతో బిజీగా ఉన్నారు దీనితో పాటు దసరా అనే సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నాని దసరా సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్నారు.సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రొమాన్స్ చేయడానికి హీరోయిన్ లేదని తెలుస్తోంది.

ఈ సినిమాలో మహానటి కీర్తిసురేష్ నటిస్తుందని తెలిసినప్పటికీ సినిమా హీరోయిన్ పాత్రలో కాకుండా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.పల్లెటూరి మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణ సింగరేణి మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇందులో కీర్తి సురేష్ నానితో రొమాన్స్ కాకుండా ఒక గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది.ఇందులో ఈమె పాత్ర ఎంతో కీలకమైనదని సమాచారం.

Advertisement

మొట్టమొదటిసారిగా నాని తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ, మొదటి సారిగా హీరోయిన్ లేకుండా నటిస్తున్న చిత్రం దసరా అని చెప్పవచ్చు.అయితే ఇందులో సమంత ఒక అతిథి పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపించినప్పటికీ ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఇక ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కూడా నటిస్తున్నారు.

 సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు