వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు..: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారన్నారు.

దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలిచామన్న ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ సీట్లు సాధించామని పేర్కొన్నారు.తాజాగా మునుగోడు ఉపఎన్నికలోనూ టఫ్ ఫైట్ ఇచ్చామని తెలిపారు.

టీఆర్ఎస్ చేసే కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టే విధంగా రెడీ అవ్వాలని చెప్పారు.రానున్న ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని వెల్లడించారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ తొండి ఆట ఆడుతోందన్నారు.కల్వకుంట్ల కుటుంబ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని తెలిపారు.2023లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు