డైరెక్టర్ గీతాకృష్ణ ఏ విషయం గురించి మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడతారని ఇండస్ట్రీలో పేరుంది.బాలయ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగడటం గురించి గీతాకృష్ణ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఇతర పార్టీల నేతల గురించి గొప్పగా మాట్లాడితే మంచి పేరు వస్తుందని అందుకే బాలయ్య ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చని గీతాకృష్ణ అన్నారు.
బాలకృష్ణ కాల్పుల కేసులో ఇరుక్కున్న సమయంలో రాజశేఖర్ రెడ్డి సహాయం చేశారని అందువల్లే బాలకృష్ణ వైఎస్సార్ గురించి పాజిటివ్ కామెంట్లు చెయ్యడానికి ఇదే కారణమని ఆయన తెలిపారు.
కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు అని వాళ్లు వైఎస్సార్ కు సన్నిహితులు కావడంతో వైఎస్సార్ గురించి పాజిటివ్ గా చెప్పడంతో వైఎస్సార్ అభిమానులకు దగ్గరవ్వాలని బాలయ్య ప్రయత్నించారని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.జగన్ కూడా బాలయ్యకు అభిమాని అని ఆయన కామెంట్లు చేశారు.
బాలయ్య అందరివాడు అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.రాబోయే రోజుల్లో బాలయ్య షోకు వెంకయ్య నాయుడు కూడా రావొచ్చని ఆయన కామెంట్లు చేశారు.
పాజిటివ్ గా కామెంట్లు చేయడం బాలయ్య పొలిటికల్ కెరీర్ కు కూడా ప్లస్ అవుతుందని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.
ఆహా ఓటీటీ వల్ల బాలకృష్ణకు మంచి జరుగుతోందని ఆయన వెల్లడించారు.బాలయ్య స్టైల్ మార్చి ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారని బాలయ్యలో అదర్ సైడ్ ను ఆడియన్స్ ను చూస్తున్నారని గీతాకృష్ణ వెల్లడించారు.గీతాకృష్ణ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్ చివరి వారం సమయానికి వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమాపై బాలయ్య అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.