Sudigali Sudheer Anil Ravipudi : ఆహా ఓటిటీలో అనిల్ రావిపూడి, సుధీర్.. డెబ్యూ కోసం రెడీ!

ఆహా తెలుగు ఓటిటీ స్టార్ట్ చేసిన అల్లు అరవింద్ దీనిని డే బై డే క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాడు.తెలుగు ప్రేక్షకులు కూడా దీనికి బాగానే అలవాటు పడుతున్నారు.

 Sudigali Sudheer And Anil Ravipudi Ott Debut, Ott Debut, Anil Ravipudi, Sudigali-TeluguStop.com

ప్రతీ శుక్రవారం కొత్త కొత్త సినిమాలను, వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఇక రకరకాల షోలు కూడా నిర్వహిస్తూ మరింత అలరిస్తున్నారు.

ఆహా ఓటిటీ లోనే బాలయ్య అన్ స్టాపబుల్ షో ప్రసారం అవుతుంది.బాలయ్య వల్ల కూడా ఆహా ఓటిటీ బాగా ఫేమస్ అయ్యింది అనే చెప్పాలి.ఇప్పుడు సీజన్ 2 గ్రాండ్ గా జరుగుతుంది.ఇదిలా ఉండగా ఆహా మరో కొత్త షో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.కామెడీ ఎంటర్టైన్ ను తీసుకు రాబోతున్నారు.”కామెడీ స్టాక్ ఎక్చేంజ్” పేరుతో డిసెంబర్ 2 నుండి ఈ షో స్టార్ట్ కాబోతుంది.

ఈ షోలో పాపులర్ కమెడియన్స్ ను తీసుకు రాబోతున్నారు.అలాగే ఒక స్టార్ డైరెక్టర్ కూడా ఈ షో ద్వారా ఓటిటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈయన ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ కొట్టి మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రెసెంట్ అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా సమయం ఉండడంతో ఈ లోపు ఈ షో ద్వారా అలరించ బోతున్నాడు.

Telugu Aha Ott, Anil Ravipudi, Stock Exchange, Ott Debut, Sudigalisudheer-Movie

అలాగే ఫేమస్ కమెడియన్ కమ్ యాంకర్ సుధీర్ కూడా ఈ షో ద్వారా ఓటిటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ షో హోస్ట్ గా సుడిగాలి సుధీర్ తో పాటు దీపికా పిల్లి చేయబోతున్నారు.ఇక ఈ కామెడీ షోలో సెలెబ్రెటీ కమెడియన్స్ వేణు, ముక్కు అవినాష్, భాస్కర్, జ్ఞానేశ్వర్, సద్దాం వంటి వారు ఉన్నారు.చూడాలి మరీ ఈ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు ఆహా వారు ఎంత మేర మెప్పిస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube