భీమ్లా నాయక్ కు ఏ మాత్రం ఉపయోగపడని జీవో.. అక్కడ రూ.5 కోట్లు నష్టమంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా గత నెల 25వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కాగా నైజాంలో కూడా త్వరలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఏపీలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా భారీ నష్టాలను మిగులుస్తోంది.ఏపీ ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన జీవో వల్ల భీమ్లా నాయక్ సినిమాకు ఏ మాత్రం చేకూరే అవకాశం కనిపించడం లేదు.

ఈరోజు నుంచే ఏపీలో కొత్త టికెట్ రేట్లు అమలులోకి రానున్నప్పటికీ భీమ్లా నాయక్ సినిమాపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఇప్పటికే ఈ సినిమాను చూసేశారు.వీక్ డేస్ లో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు లేవు.

మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో భారీస్థాయిలో రిలీజ్ కానున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కోల్పోయే అవకాశం ఉంటుంది.సీడెడ్ లో మరో 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.

Advertisement

ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లతో ఏపీలో భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ కావడం సులువు కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

భీమ్లా నాయక్ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోవడంతో రాధేశ్యామ్ కు మాత్రమే కొత్త టికెట్ రేట్ల వల్ల బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.కొత్త రేట్ల ప్రయోజనాలను భీమ్లా నాయక్ మాత్రం అందుకోలేదని చెప్పాలి.అయితే పెరిగిన టికెట్ రేట్ల వల్ల పవన్ తర్వాత సినిమాలకు మాత్రం ప్రయోజనం చేకూరనుంది.

ఏపీలో టికెట్ రేట్లు పెరిగి ఉంటే మాత్రం భీమ్లా నాయక్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పెరిగిన టికెట్ ధరల వల్ల భీమ్లా నాయక్ మూవీకి ఒరిగిందేమో లేదని అభిమానులు భావిస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు