ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ రేటు పెంచింది

అందంతో పాటు నటనతో ఆకట్టుకునే హీరోయిన్స్‌ ఇండస్ట్రీలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు అనే విషయం కాస్త కటువు అయిన ఒప్పుకోవాల్సిందే.

ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్‌ ఉన్నా కూడా చక్కని నటనను కనబర్చే హీరోయిన్స్‌ మాత్రం తక్కువగా ఉన్నారు.

అందులో నిత్యామీనన్‌ ఒకరు.ఈమె కాస్త పొట్టిగా ఉన్నా అందంగా కనిపించి ఆకట్టుకుంటూ, తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.

నటకు ప్రాముఖ్యత ఉన్న ఏ పాత్రలను అయినా ఈమె అవలీగా చేస్తుంది అనే టాక్‌ ఉంది.తెలుగు, తమిళం, మయాళంలో సినిమాలు చేస్తున్న ఈమెకు ఇటీవలే ‘గంగ’ సినిమాతో సూపర్‌ హిట్‌ వచ్చింది.

దాంతో తన పారితోషికాన్ని భారీగా పెంచేసింది.‘గంగ’కు ముందు వరకు 50 నుండి 60 లక్షల వరకు తీసుకున్న నిత్యామీనన్‌ ఇక తన కొత్త సినిమాకు కోటి రూపాయు ఇస్తేనే చేస్తాను అంటూ డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

కోటి ఇస్తే చేస్తా, లేకుంటే ఖాళీగానే ఉంటాను అంటూ ఈ అమ్మడు కండీషన్స్‌ పెడుతుంది.ఈమెకు కోటి అంటే కాస్త ఎక్కువే అని ఫిల్మ్‌ మేకర్స్‌ ఈమెను అవైడ్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

పారితోషికం తగ్గించుకోకుంటే కెరీర్‌ ఖతం అయినట్లే అని నిత్యాకు సన్నిహితు సహాలు ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు