సీనియర్ హీరోయిన్స్ అయిన కాజల్, తమన్నా, శ్రియలతో తనను పోల్చవద్దని, వారు బాలీవుడ్ వెళ్లి సక్సెస్ సాధించలేక మళ్లీ ఇక్కడకు వచ్చారు అంటూ ఆ మధ్య రకుల్ కామెంట్స్ చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.సీనియర్ హీరోయిన్స్‌పై ఈమె కామెంట్స్‌కు సినీ ప్రముఖులతో పాటు, ఆ హీరోయిన్స్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు.
ఈమెకు కాస్త తల బిరుసు ఎక్కువ అయ్యిందంటూ విమర్శలు వచ్చాయి.దాంతో తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ, ఆ వార్తను ఖండించింది.
మీడియాలో వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ట్వీట్ చేసింది.ప్రస్తుతం తాను లండన్‌లో సినిమా కోసం ఉన్నాను అని, అలాంటప్పుడు ఎలా మీడియాతో ఈ విషయాలు మాట్లాడి ఉంటాను అని అనుకుంటున్నారు అంటూ ట్విట్టర్‌లో పేర్కొంది.
తనకు సీనియర్ హీరోయిన్స్ అంటే గౌరవం అని, తాను అలాంటి కామెంట్స్ ఎప్పటికి చేయబోను అంటూ ఈమె చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రకుల్ నటిస్తోంది.
ఇక రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సైతం ఈమె హీరోయిన్‌గా నటిస్తుంది.







