నితిన్ వెంకీ కుడుముల కొత్త మూవీ టైటిల్ ఇదేనా.. అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారంటూ?

టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో వెంకీ కుడుముల( Venky Kudumula ) ఒకరు.

ఛలో, భీష్మ సినిమాల ద్వారా విజయాలను సొంతం చేసుకున్న వెంకీ కుడుముల డైరెక్షన్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

నితిన్( Nitin ) వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు రాబిన్ హుడ్( Robin Hood ) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.కథ ప్రకారం ఇదే కరెక్ట్ టైటిల్ అని మేకర్స్ భావిస్తున్నారు.

త్వరలో ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి మేకర్స్ స్పందిస్తే మాత్రమే స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి.నితిన్, శ్రీలీల( Srilila ) కాంబినేషన్ లో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

Advertisement

నితిన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉండగా కొత్త సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.వెంకీ కుడుముల ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోల సినిమాలకు పని చేసే అవకాశం అయితే దక్కుతుందని చెప్పవచ్చు.నితిన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా నితిన్ సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతోంది.

నితిన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కష్టపడితే మాత్రం సక్సెస్ దక్కడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.కథల ఎంపికలో నితిన్ జాగ్రత్త వహించాల్సి ఉంది.నితిన్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా విడుదలవుతాయేమో చూడాల్సి ఉంది.

నితిన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు