యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమా( Extra Ordinary Man ) రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ముందుగా ఈ సినిమా ను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేశారు.
కానీ క్రిస్మస్ కి ప్రభాస్ నటించిన సలార్ ని( Salaar ) విడుదల చేస్తున్నట్లుగా ప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించాడు.దాంతో వెంటనే రెండు వారాల ముందుగానే ఈ సినిమా ను విడుదల చేయడం జరుగుతుంది.

ఈ సినిమా ను నితిన్( Nithiin ) తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించాడు.ఈ సినిమా కి వచ్చిన బజ్ నేపథ్యం లో విడుదల కు ముందే దాదాపుగా పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనే వార్తలు వస్తున్నాయి.అన్ని వర్గాల వారిని మరియు ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక మంచి ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ను రూపొందించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందనే నమ్మకం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా కి వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) దర్శకత్వం వహించిన నేపథ్యం లో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే ఆయన గత చిత్రం అల్లు అర్జున్ తో చేసి నిరాశ పరిచిన విషయం తెల్సిందే.అందుకే ఈ సినిమా ఎలా ఉంటుందో అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో కొందరు ఈ సినిమా గురించి నెగటివ్ గా కామెంట్స్ చేసినా కూడా ఎక్కువ శాతం సినిమా బాగుంటుంది అనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు.
రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా పై శ్రీలీల( Sreeleela ) కూడా చాలా నమ్మకం పెట్టుకుంది.ఆమె స్కంద మరియు ఆది కేశవ సినిమా తో నిరాశ పరిచింది.
అందుకే తన క్రేజ్ కంటిన్యూ అవ్వాలంటే ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే.