నేచురల్ స్టార్ నాని ( Nani )మంచి టైమింగ్ ఉన్న నటుడు.ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల ప్రతిభావంతుడైన నటుడు కూడా.
టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో అతని లాగా సహజంగా నటించే హీరోలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.నాని ఎలాంటి కష్టమైన హావభావాలనైనా ముఖంపై చాలా అవలీలగా పలికించగలడు.
అయితే స్టార్ ఇమేజీ వచ్చాక ఈ హీరో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను వదిలేసి ప్రేక్షకుల్లో నవ్వుల పాలయ్యే క్యారెక్టర్లను ఎంచుకుంటున్నాడు.గతంలో వచ్చిన అతడి టక్ జగదీష్ సినిమాలో చొక్కాలో నుంచి కత్తి తీసి దానితో ఒక ప్లేట్ లోని ఉల్లిపాయ పొట్టు తీసి కట్ చేస్తాడు.
ఎంతో టాలెంట్ పెట్టుకొని ఇలాంటి సిల్లీ సన్నివేశాలకి అతడు ఒప్పుకోవడం నిజంగా బాధాకరం.

దసరా సినిమాలోనూ నాని కేరక్టరైజేషన్ చెత్తగా ఉంది.పాత్రకు తగిన పర్ఫామెన్స్ కనబరిచాడు కానీ ఫ్యాన్స్‌ను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు.ఇక యాక్షన్ థ్రిల్లర్ వి (2020), రొమాంటిక్ కామెడీ “అంటే సుందరానికి (2022)” వంటి సినిమాలు నాని అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు.
అభిమానులు ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్న ఇలాంటి సమయంలో నాని “హాయ్ నాన్న” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ మూవీ కొత్త దర్శకుడు శౌర్యవ్‌తో( director Souryav ) కలిసి చేయడం వల్ల అభిమానులు భయపడ్డారు కానీ వారందరినీ సంతోష పెడుతూ ఈ మూవీ ఫస్ట్ డేనే హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా మొత్తానికి నాని పర్ఫామెన్స్ హైలెట్ అయిందని చాలామంది చెబుతున్నారు.ఎమోషనల్ సీన్స్ లో నాని అదరగొట్టాడని చెప్పక తప్పదు.ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీలో పాత నాని కనిపించాడని అనొచ్చు.ఒక ఫ్యామిలీలోని బంధాలు ఎలా ఉంటాయో, వారి మధ్య ప్రేమ ఎంత ఎమోషనల్ గా ఉంటుందో డైరెక్టర్ చూపించగలిగాడు.
ఆ డైరెక్టర్ రాసిన పాత్రకు నాని 100% న్యాయం చేశాడు.పిచ్చి ఫైటింగ్ లు, బిల్డప్ లు ఏవి లేకుండా ఒక క్లాస్ సినిమాగా వచ్చిన ఈ సినిమాలో నాని వన్ మ్యాన్ షో కనబరిచాడు.
మృణాల్ ఠాకూర్‌తో ( Mrinal Thakur )పెద్దగా రొమాన్స్ లేకపోయినా ఆమె పాత్ర మూవీలో కీలక పాత్ర పోషించింది.శౌర్యవ్ నాని, మృణాల్ పంటి యాక్టింగ్ తెలిసిన నటీనటులను తీసుకోవడం వల్ల ఈ సినిమా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది.
మొత్తం మీద ఈ మూవీ కచ్చితంగా నానికి ఒక మంచి హిట్ అందిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.







