'కార్తికేయ 2' నార్త్ ప్రేక్షకులను మెప్పించడానికి కారణం అదేనా?

కార్తికేయ 2 పేరు ఇప్పుడు దేశం అంతటా మారుమోగి పోతుంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా కార్తికేయ 2.

 Nikhil Karthikeya 2 Towards Huge Blockbuster Details, Nikhil Siddharth, Karthikeya 2, chandu Mundeti ,anupama Parameswaran, Bollywood, Karthikeya 2 Movie, North Audience, Sri Krishna, Anupam Kher-TeluguStop.com

నిఖిల్ కెరీర్ లోనే కార్తికేయ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.

 Nikhil Karthikeya 2 Towards Huge Blockbuster Details, Nikhil Siddharth, Karthikeya 2, Chandu Mundeti ,Anupama Parameswaran, Bollywood, Karthikeya 2 Movie, North Audience, Sri Krishna, Anupam Kher-కార్తికేయ 2#8217; నార్త్ ప్రేక్షకులను మెప్పించడానికి కారణం అదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ముందు నుండి కూడా ఆడియెన్స్ కార్తికేయ 2 పై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ లో వండర్ క్రియేట్ చేస్తుంది.అక్కడ మార్కెట్ లో కార్తికేయ 2 కు భారీ డిమాండ్ నెలకొంది.

సౌత్ నుండి అది కూడా మన టాలీవుడ్ నుండి మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా రావడంతో అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తుంది.అక్కడి పెద్ద సినిమాలను కూడా పట్టించు కోకుండా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

Telugu Anupam Kher, Bollywood, Chandu Mundeti, Karthikeya, Audience, Sri Krishna-Movie

రోజురోజుకూ స్క్రీన్ లు పెంచుకుంటూ పోతున్నారు.మన సౌత్ లో కూడా ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించలేదు.మరి అంతలా నార్త్ ప్రేక్షకులను అలరించడానికి కారణం ఏంటా అని అందరు ఆరా తీస్తున్నారు.శ్రీకృష్ణుడి రహస్యాల నేపథ్యంలో తెరకెక్కడం వల్ల ఈ సినిమా మరింత ఆకట్టుకుంటుంది అని చెబుతున్నారు.

ఉత్తరాది ప్రజలు ఎక్కువుగా కృష్ణుడిని ఆరాధిస్తారు.మరి ఈ సినిమాలో కృష్ణుడి ఔనత్యాన్ని చాటి చెప్పే ఒక సీన్ కూడా ఉంది.

ఆ సీన్ కారణంగానే అక్కడి ప్రేక్షకులు సినిమాను చూస్తున్నారని.ఇది ఒక సినిమాకు సీక్వెల్ అని కూడా అక్కడి వారికి తెలియదు అని అంటున్నారు.

మొత్తానికి ఉత్తరాది ప్రజల కారణంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లలో ఒకటిగా చేరిపోయింది.ఇదే స్పీడ్ కొనసాగితే పెట్టుబడికి డబల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube