కార్తికేయ 3 పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. అంతకుమించి అంటూ కామెంట్స్?

చందు మొండిటి దర్శకత్వంలో హీరో నిఖిల్ కలర్స్ స్వాతి జంటగా నటించిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఆగస్టు 5వ తేదీ విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Nikhil Who Gave Clarity On Karthikeya 3 Comments Saying More Than That Nikhil , Karthikeya 3, Karthikeya 2 , Chandu Monditi ,colors Swathi ,anupama,-TeluguStop.com

ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా 100 కోట్లను రాబట్టడంతో సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

శ్రీకృష్ణుడు జన్మస్థానమైన ద్వారకలో దాగి ఉన్న రహస్యాలను బయట పెడుతూ దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

 Nikhil Who Gave Clarity On Karthikeya 3 Comments Saying More Than That Nikhil , Karthikeya 3, Karthikeya 2 , Chandu Monditi ,Colors Swathi ,anupama,-కార్తికేయ 3 పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. అంతకుమించి అంటూ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా కేవలం సౌత్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నార్త్ ప్రేక్షకులను సైతం ఎంతో ఆకట్టుకుందని చెప్పాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాని మలయాళ వెర్షన్ లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ క్రమంలోనే హీరో నిఖిల్ సైతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

Telugu Anupama, Chandu Monditi, Colors Swathi, Karthikeya, Nikhil-Movie

ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో కార్తికేయ 3 పై అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు.కార్తికేయ 3 సినిమా కూడా ఉండబోతుందా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలిగింది.ఈ క్రమంలోనే ఈ విషయంపై హీరో నిఖిల్ స్పందిస్తూ కార్తికేయ 3తప్పనిసరిగా ఉంటుందని, కార్తికేయ 2 సినిమాని మించి ఈ సినిమా ఉండబోతుందని త్వరలోనే ఈ విషయాల గురించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా నిఖిల్ వెల్లడించారు.

ఇక మలయాళ వెర్షన్ లో కార్తికేయ2 సెప్టెంబర్ 23వ తేదీ విడుదల కానుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube