మెగా హీరోలను వెంటాడుతున్న ఇంగ్లీష్ సెంటిమెంట్.. రిపీట్ అయితే మరో ఫ్లాప్ తప్పదు!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి.అయితే కొన్ని మంచి సెంటిమెంట్లతో పాటు మరికొన్ని బ్యాడ్ సెంటిమెంట్లు కూడా ఉంటాయి.

 The English Sentiment That Haunts Mega Heroes If It Repeats Another Flop Is Boun-TeluguStop.com

ఇలాంటి సెంటిమెంట్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు కూడా వారికి చేదు అనుభవాలను మిగిల్చిన సంఘటనలు ఎంతో మంది హీరోల విషయంలో చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే మెగా హీరోలను కూడా కొన్ని సెంటిమెంట్స్ వెంటాడుతున్నాయని చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవి ఆ అనే అక్షరంతో సినిమాలు చేస్తే కనుక ఆ సినిమాలు ఫ్లాప్ అవుతాయని సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.అయితే మెగా కుటుంబానికి ఇంగ్లీష్ బ్యాడ్ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది.

మెగా హీరోలు నటించిన సినిమా టైటిల్స్ ఇంగ్లీషులో కనుక ఉంటే ఆ సినిమాలు డిజాస్టర్ గా మిగులుతున్నాయి.ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ బ్రూస్ లీ వంటి సినిమాలు ఫ్లాప్ కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు కూడా ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నవి డిజాస్టర్ అయ్యాయి.

Telugu Heroes, Chiranjeevi, Aa, Orange, Ram Charan-Movie

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్, డాడీ, బిగ్ బాస్, వంటి సినిమాలు ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి గాడ్ ఫాదర్ సినిమా కూడా ఇంగ్లీష్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే మెగా హీరోలు నటించిన సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ ఉంటే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఇదే సెంటిమెంట్ కనుక రిపీట్ అయితే గాడ్ ఫాదర్ సినిమా కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరి గాడ్ ఫాదర్ విషయంలో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా తెలియాలంటే అక్టోబర్ 5వ తేదీ వరకు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube